Home » Ponguru Narayana
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతులకు నూతన విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఏపీ పట్టణ, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
ఢిల్లీ పర్యనటలో భాగంగా ఇవాళ (మంగళవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను కేంద్ర మంత్రి దృష్టికి నారాయణ తీసుకెళ్లారు.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు అన్నారు.
బుడమేరు ప్రాంతంలో ఆక్రమణలు తొలగించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆ ప్రాంతంలో ఉంటున్న పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా టిడ్కో ఇళ్లు ఇస్తామని మంత్రి చెప్పారు. పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించి మరోసారి ఉపద్రవం రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
Andhrapradesh: నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీలో మంత్రి నారాయణ సుడి గాలి పర్యటన చేశారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ మంత్రి పర్యటించారు. నిన్నటి వరకు వరద నీరు ఉన్న ప్రాంతాల్లో శరవేగంగా వందలాది పారిశుధ్య కార్మికులతో క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి.
బంగాళాఖాతంలో మరోసారి ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినట్లు ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మరో 48గంటల్లో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Andhrapradesh: విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులకు రేపటి (సెప్టెంబర్ 6) నుంచే నిత్యావసరాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని 179 వార్డు, మూడు గ్రామ సచివాలయం పరిధిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు.
వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నిర్వీర్యం చేసిందని ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. 2014-19మధ్య గత టీడీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి రూ.41వేల కోట్లతో టెండర్లు ఇచ్చామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని నాశనం చేసి కూర్చుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి ఆయన సతీమణి, జెడ్పీ ఛైర్పర్సన్ అరుణమ్మ టీడీపీలో చేరుతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నివాసానికి విజయకుమార్ రెడ్డి, అరుణమ్మ దంపతులు వెళ్లడంతో నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వారు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు జిల్లావ్యాప్తంగా విస్తృత చర్చలు నడుస్తున్నాయి.