Home » Ponnam Prabhakar
కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈవీ(ఎలక్ట్రిక్ వాహనాలు)ల రిజిస్ట్రేషన్‌లో ప్రభుత్వం రాయితీలు ఇస్తున్న విషయం ప్రజలకు చేరువవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించింది.
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీని ద్వారా వాహనదారులకు ఏడాదికి సుమారు రూ. లక్ష మిగులు తుందన్నారు. తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ వస్తుందని ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులోభాగంగా రాష్ట్రంలో రవాణా శాఖ పరంగా మార్పులు, చేర్పులు తీసుకొచ్చి... ప్రజల్లో చైతన్య కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ మహానగరంలో కాలుష్య రహితంగా ఉంచేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ బిడ్డ అయితే.. డీఎన్ఏ పరీక్ష చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆయన తెలంగాణ బిడ్డ అయితే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి కానీ.. అవరోధంగా ఎందుకు మారారని ప్రశ్నించారు.
తెలంగాణ అభివృద్ది గురించి కేేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పట్టదని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి ఒంట్లో తెలంగాణ డీఎన్ఏ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాటి చెట్లు ఎత్తు తక్కువ ఉండేలా కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. స్థలం ఉంటే బోర్లు వేసి చెట్లను నాటి కాపాడుకోవాలని అన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజకీయ పార్టీ ఏదైనా సరే విమర్శలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనుమతిస్తున్నామని అన్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని అధికారులపై దాడులు చేస్తే ఊరుకోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
సమాజంలో అసమానతలను తొలగించడానికి, రుగ్మతలను రూపుమాపడానికి ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను అడ్డుకునేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) హెచ్చరించారు.
అధికారులపై దాడులు చేస్తే ఎంతమాత్రం సహించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ‘‘ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నాం. రాజకీయ పార్టీ ఏదైనా సరే విమర్శలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనుమతిస్తున్నాం.
Telangana: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు నిరసన తెలపడంలో తప్పులేదని.. కానీ అధికారులపై దాడి చేయడం తప్పన్నారు. కలెక్టర్‌ను కొట్టే ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. పైనున్న నాయకుల ప్రోత్సాహం వల్లనే కదా అని ప్రశ్నించారు.