Home » Postal Ballots
నర్సాపురం పోస్టాఫీసు రెండు మూడు రోజులుగా మూతబడింది. ఇక్కడ పనిచేస్తున్న బీపీఎం నాయక్ విధులకు గైర్హాజరవుతున్నట్లు పైఅధికారుల దృష్టికి వెళ్ళడంతో మంగళవారం బద్వేల్ పోస్టల్ సబ్‌డివిజన్ హెడ్ ఎన్.సుబ్బరాయుడు పోస్ట్ట్ఆఫీసును తనిఖీ చేశారు. సిబ్బంది కార్యాలయం తెరవక పోవడంతో గ్రామస్థుల సమక్షంలో కార్యాలయం తాళాలు పగులగొట్టారు.
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) సుప్రీంలో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్‌పై సోమవారం సుప్రీంలో విచారణ జరగనుంది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరుగుతంది. పోస్టల్ బ్యాలెట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి (YSR Congress) హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్(Postal Ballots) డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది...
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్ సర్కారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీసు ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేశాం.. ఇక ప్రమాణ స్వీకారం, సంబరాలే ఆలస్యం అన్నట్లుగా అసలు సిసలైన ఫలితాలకు ముందే తెగ హడావుడి చేస్తున్న వైసీపీకి ఊహించని ఝలక్ తగిలింది...
పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తోందన్నారు. ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్‌పై వేసిన అప్పీల్లో వైసీపీ తోక ముడిచిందన్నారు. తాము ఓడిపోయినా.. నిసిగ్గుగా ఎలక్షన్ కమిషన్ పై వైసీపీ విషం కక్కుతోందన్నారు.
వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఎన్నికల సంఘంపై (Election Commission) వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విసయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena) ఘాటుగా స్పందించారు. మచిలిపట్నంలోని కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయ్. ఈ పరిస్థితుల్లో అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని ఝలక్ ఇచ్చింది..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections 2024) పోస్టల్ బ్యాలెట్ పత్రంపై ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ ఓటు వేయకపోయినా, ఒకరికంటే ఎక్కువ మందికి ఓటేసినా అది చెల్లుబాటు కాదు...