Home » Pothina Venkata Mahesh
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. జనసేన(Janasena)లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దీంతో కూటమికి నష్టం జరుగుతుందని అంతా అంచనా వేశారు. కాని వైసీపీ వ్యూహాన్ని తిప్పికొట్టేలా బీజేపీ మరో ప్లాన్ వేసింది.
జనసేన యువనేత పోతిన వెంకట మహేష్ (Pothina venkata mahesh) సోమవారం నాడు ఆ పార్టీకి , పదవులకు రాజీనామా చేశారు. ఈ సమయంలో జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులో భాగంగా తమ పార్టీకి తీరని అన్యాయం చేశారని మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: జనసేన తరపున విజయవాడ పశ్చిమ సీటును ఆశించి.. కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న పోతిన వెంకట మహేష్ జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. జనసేన పార్టీకి, పదవులకు పోతిన రాజీనామా చేశారు. ఏపీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని పోతిన ఆశించారు. తనకు సీటు ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు కూడా. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును బీజేపీకి కేటాయించడం జరిగింది..