Home » Priyadarshi Pulikonda
ఆదివారం నాడు 'బలగం' సినిమాకి పని చేసిన అందరినీ సన్మానిస్తూ, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఈ సినిమాకి పన్ని రాయితీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నిర్మాత దిల్ రాజు ఎన్నో పదుల సార్లు తన సినిమా 'బలగం' చూసి వున్నా, విడుదల అయిన మొదటి రోజు ప్రేక్షకులతో అదే సినిమా చూసిన ఆ అనుభవం అతన్ని ఎలా మార్చిందో అయన మాటల్లోనే...
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందిన చిత్రం ‘బలగం’ (Balagam). ప్రియదర్శి (Priyadarshi), కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించింది. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు.
దిల్ రాజు ప్రొడక్షన్స్ (Dil Raju Productions) బ్యానర్లో తెరకెక్కి.. మార్చి 3న థియేటర్లలోకి వచ్చిన ‘బలగం’ (Balagam) చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం
రెండు మూడు రోజులుగా చిన్న సినిమా ‘బలగం’ (Balagam)కు సంబంధించి టాక్ బాగా వైరల్ అవుతుంది. ప్రమోషన్స్, ప్రీమియర్స్ అంటూ విడుదలకు ముందు ఈ సినిమాకి రావాల్సిన క్రేజ్ వచ్చింది. ప్రీమియర్స్ తర్వాత
'బలగం' అనే సినిమా నూటికి నూరుపాళ్లు తెలంగాణ పల్లె జీవిత కథ. తెలంగాణ గ్రామంలో వున్న సంప్రదాయం, కట్టుబాట్లు, కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ఆచారాలు గురించి చెప్పే భావోద్వేగమయిన కథ. కుటుంబం కానీ, గ్రామం కానీ, లేదా ఎక్కడ అయినా, అందరూ కలిసి ఉంటే అదే ఒక బలగం అవుతుంది అనే చెప్పే కథ. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా.