Home » Rammohannaidu Kinjarapu
Andhrapradesh: విమాన టికెట్ల ధరలపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ వ్యక్తులే కాదు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని.. విమానయాన టికెట్ల ధరలు ప్రజలకు అనుకూలంగా ఉండాలని అన్నారు.
విశాఖ- విజయవాడ నగరాల మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీని వల్ల ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చి ఫ్లైట్ ఛార్జీలు తగ్గుతాయని కేంద్ర మంత్రి తెలిపారు.
శబరిమల అయ్యప్ప మాల ధరించే స్వాములకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తీపికబురు చెప్పారు.
Andhrapradesh: ‘‘నేను మంత్రిని అయ్యాక చాలా మంది ముఖ్యమంత్రులు ఎయిర్పోర్టులు, హెలిపోర్టుల గురించి అడిగారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ఎయిర్పోర్టులతో పాటు కనెక్టివిటీ, డ్రోన్ల ప్రాధాన్యం గురించి మాట్లాడారు’’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Andhrapradesh: సిట్ అంటే ఎందుకంత భయమని జగన్ను ప్రశ్నించారు. సుప్రీం ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తారని భావించామని.. కానీ సిట్ లేదు గిట్ లేదని పలుచన చేయడం ఎంతవరకు సంస్కారమని నిలదీశారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah)తో పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఆదివారం భేటీ అయ్యారు. భారత విమానయాన రంగం పురోగతిపై సమీక్షించడంతోపాటు ఎయిర్ పోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై అమిత్ షాతో చర్చించారు.
అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం చంద్రబాబు ఇద్దరూ కలిసి ఏపీని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికే రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు, పోలవరం మెుదటి దశ పనుల కోసం రూ.12,567కోట్లు కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు.
Andhrapradesh: విజయవాడలో అంత పెద్ద వరద వచ్చాక పది రోజుల్లో మళ్లీ నార్మల్ స్థాయికి తేవటం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు వల్లే సాధ్యం అయ్యిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ‘‘ఇది నేను కాదు.. వరదల్లో ఇబ్బందులు పడ్డ ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారు’’ అని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ను మరో రెండేళ్లలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు.
Andhrapradesh: విజయవాడ ఎయిర్ పోర్ట్లో కొత్త రోడు ప్రారంభించడం జరిగిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... మైసూర్ ఎంపీ యువరాజ్ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో చాలా ఎయిర్పోర్టులు ఉన్నా కానీ గన్నవరం ఎయిర్పోర్ట్పై దృష్టి పెట్టినట్లు తెలిపారు.