Home » Sonia Gandhi
తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది జనం సాక్షిగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర అగ్రనేతలకు చెప్పినట్లు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభు త్వం, సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్ ఉప ఎన్నికలను కోరుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఆయన అగ్ర నేతలతో సమావేశం కానున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
మహిళా సభ్యులతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మాట్లాడే తీరు బాగోలేదంటూ సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు, సీనియర్ నటి జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేయడం రాజ్యసభను వేడెక్కించింది.
క్విటిండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్లో శుక్రవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
దేశంలోని జనాభాను లెక్కించే ప్రక్రియ 2021లో జరగాల్సి ఉండగా, ఇంతవరకూ జనగణన ను కేంద్రం చేపట్టలేదని, అసలు ఆ ఉద్దేశమే ఉన్నట్టు కనిపించడం లేదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ అన్నారు. దీంతో దేశంలో ఇతమిత్ధమైన జనాభా ఎంతో తెలియకుండా పోతుందన్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై దాదాపుగా స్పష్టత వచ్చింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 15 రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. టీ పీసీసీ పోస్ట్ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలు జోరుగా లాబీయింగ్ చేశారు. కొద్దిరోజులు ఢిల్లీలోనే మకాం వేశారు. చివరికి హైకమాండ్ ఎస్టీ నేత వైపు మొగ్గుచూపారని విశ్వసనీయ సమాచారం.
ముందు చూపుతోనే హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ ఈ మేరకు బడ్జెట్ను ఏనాడైనా కేటాయించారా అంటూ నిలదీశారు.
ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కొన్ని పథకాలకు తాజా బడ్జెట్లో నిధులను కేటాయించలేదు. దాంతో ఈ పథకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.