Home » Sri Ramaraksha Stotram
రామ జన్మభూమి అయోధ్యలో దొంగలు రూ.50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లారు. ఎల్లప్పుడూ భద్రతా సిబ్బంది కనుసన్నల్లో ఉండే భక్తి పథ్, రామ్ పథ్ మార్గాల వెంబడి వెదురు కర్రలకు అమర్చిన 3800
పురాణపండ రాధాకృష్ణమూర్తి యజ్ఞమయ సంకల్పం బలమైనది కాబట్టే ఆయన కుమారుడు, ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ తన తండ్రి మహదాశయాన్ని సరిక్రొత్త పుంతలు తొక్కిస్తూ తెలుగు రాష్ట్రాల ఆలయాల్ని, పీఠాల్ని, మఠాల్ని, వేదపాఠశాలల్ని శ్రీరామరక్షాస్తోత్రమ్ అఖండ మగలా స్తోత్ర వైభవ ప్రచారంతో, ఉచిత పంపిణీతో చుట్టేస్తున్నారు.
అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి శ్రీ రాముడి నుదిటిపై పడే సూర్యుడి కిరణాలపై ఉంది.
ఈ సంవత్సరం భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణోత్సవంలో సుమారు ముప్పైవేల శ్రీరామరక్షా స్తోత్రమ్ ప్రతులు కళ్యాణోత్సవంలో పాల్గొనే దంపతులకు, ఉభయదాతలకు, భక్తులకు అందజేయనున్నట్లు ఇప్పటికే శ్రీ సీతారామ చంద్ర దేవస్థాన జాయింట్ కమీషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారిని శ్రీమతి ఎల్. రమాదేవి ప్రకటించారు.
చైత్ర మాసం వసంత నవరాత్రులతో ఆరంభమవుతుంది. అంటే ఈ చైత్ర మాసంలో పాడ్యమి రోజు తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాదితో ప్రారంభమై.. నవమి రోజు అంటే శ్రీరామనవమితో ఈ వసంత నవరాత్రులు ముగుస్తాయి. అలాంటి చైత్రశుద్ద నవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మించారు.
ఈ సారి శ్రీ సీతారామచంద్ర దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఎల్. రమాదేవి సమర్ధ సేవలతో ప్రత్యేక శోభతో విరాజిల్లనున్న భద్రాద్రి కళ్యాణవేదిక సాక్షిగా ‘శ్రీరామరక్షా స్తోత్రం’ గ్రంధం భక్త పాఠకులను అలరించబోతోంది.