Home » Swati Maliwal Assault Case
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ కు సుప్రీంకోర్టు సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సుమారు 100 రోజుల పాటు జైలులో కుమార్ ఉన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ పై ఢిల్లీ పోలీసులు మంగళవారంనాడు తీస్ హజారీ కోర్టులో ఛార్జిషీటు నమోదు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. దాడి కేసులో బెయిల్ కోసం బిభవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం తిరస్కరించింది.
'ఆప్' రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ బెయిలు అభ్యర్థనపై తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు రిజర్వ్ చేసింది. జూలై 12న తీర్పు ఇవ్వనుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహచరుడు బిభవ్ కుమార్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని జూలై 16వ తేదీ వరకూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టు శనివారంనాడు పొడిగించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ కు 3 రోజుల పోలీసు కస్టడీకి ఢిల్లీ తీజ్ హజారీ కోర్టు మంగళవారంనాడు ఆదేశించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ కు ఢిల్లీ తీజ్ హజారీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి తాను రాజీనామా చేయనని, పార్టీ ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు చెందినది కాదని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చెప్పారు. దాడి ఘటన అనంతరం బీజేపీకి చెందిన ఎవరూ తనను కలవలేదని కూడా ఆమె వివరణ ఇచ్చారు.