Home » TATA IPL2023
ఈసారి ఐపీఎల్ ఫైనల్ (Final of IPL 2023) మ్యాచ్ ఎంత రంజుగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. ధోనీ నాయకత్వంలో టీమిండియా ఎన్ని ఘనతలు సాధించిందో తెలిసిందే. ఇక, ఐపీఎల్లో కూడా ధోనీ కెప్టెన్సీ అద్వితీయం. మొత్తం 14 సీజన్లలో చెన్నై టీమ్‌కు నాయకత్వం వహించి 10 సార్లు తన టీమ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
దాదాపు రెండు నెలలు ఎంతో ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్-16 అంతే ఆసక్తికరంగా ముగిసింది. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి.
ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. భారత క్రికెట్‌కు సంబంధించినంత వరకు అత్యుత్తమ కీపర్ అని చెప్పుకోవాలి. కీపింగ్‌లో ధోనీ అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పాడు. ఇక, వికెట్ల వెనుక నిలబడి స్టంపింగ్ చేయడంలో అయితే ధోనీ అత్యంత వేగంగా స్పందిస్తాడు
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రధాన కార్యదర్శి జే షా ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఐపీఎల్-16లో అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఐపీఎల్ చరిత్రలో ఐదో సారి టైటిల్ అందుకుంది.
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ.. ప్రపంచంలోనే అత్యధిక ధనిక లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. అయితే క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే తీరు మాత్రం అత్యంత పేలవం.
మహేంద్ర సింగ్ ధోనీ తను ఎంతగానో అభిమానించే తమిళ తంబీలకు మరపురాని బహుమతిని అందించాడు. ఐదో సారి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను ఐపీఎల్ విజేతగా నిలబెట్టాడు. సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై విజయం సాధించింది.
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే సెంచరీ కూడా సాధించాడు
గుజరాత్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు సెంచరీలు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.