Home » TS Assembly Elections
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul)పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అయింది. తెలంగాణ - 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కేఏ పాల్ చెప్పారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు.
ఖమ్మం జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఎక్కువ అయ్యాయని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఓడి పోయామని బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ( Pocharam Srinivasa Reddy ) అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం నాడు ఖమ్మం పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పార్టీలు కలిపి 54 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ( KTR )మాట్లాడుతున్నారని ఆ వ్యాఖ్యలు సరైనవి కావని.. ఇది మంచి పద్ధతి కాదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasiva Rao ) పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంభావం, అహంకారంమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణంమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుందని సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ ( CPI Ramakrishna ) వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. దీంతో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అందజేయనున్నది. ఈ మేరకు వారు రాజ్‌భవన్‌కు బయలు దేరి వెళ్లారు.
జూబ్లీహిల్స్ ( Jubilee Hills ) అభ్యర్థుల భవితవ్యం ఇంకా తేలలేదు. ఈ నియోజకవర్గ కౌంటింగ్‌పై ఉత్కంఠత కొనసాగుతోంది. 45 ఈవీఎంల సీల్ తొలగించారంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ( Azharuddin ) ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి అజారుద్దీన్ నిరసన వ్యక్తం చేశారు.
పటాన్చెరు ఎన్నికల రిజల్ట్స్‌కి ( Patancheru Election Results ) బ్రేక్ పడింది. 23వ రౌండ్ కౌంటింగ్‌ని అధికారులు నిలిపివేశారు. రీ కౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) పట్టుబడుతున్నారు. ఎన్నికల అధికారులు, ఆర్వోతో కాట శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. కౌంటింగ్ కేంద్రానికి మహిపాల్‌రెడ్డి ( Mahipal Reddy ), కాట శ్రీనివాస్ వర్గీయులు భారీగా చేరుకున్నారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కి ప్రజలు జై కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) శుభాకాంక్షలు తెలిపారు. కవిత ఏమన్నారంటే.. ‘‘ఈ ఎన్నికల్లో కష్టపడిన BRS కుటుంబ సభ్యుల కృషికి ధన్యవాదాలు. మీరు చేసిన పోరాటానికి సోషల్ మీడియా యోధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.అధికారం ఉన్నా, లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమే. మనమందరం మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దాం’’ అని కవిత తెలిపారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్ ( Goshamahal ) నియోజకవర్గం నుంచి బీజేపీ ( BJP ) అభ్యర్థి రాజాసింగ్ ( Rajasingh ) హ్యాట్రిక్ విజయం సాధించారు. బీజేపీ తెలంగాణ అద్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తర్వాత రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించి రికార్డు సాధించారు.