Home » ts ssc result 2024
Telangana: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఎస్ఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పై చేయి. బాలికలు 93.23 ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42శాతం ఉత్తీర్ణత పొందారు.
తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త!. మంగళవారం (ఏప్రిల్-30న) నాడు ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఉదయం 11. 00 గంటలకు పదో తరగతి ఫలితాలు (TS 10th Class Results 2024 ) విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు..
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. మరికొద్ది సేపట్లో తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలు-2024 ఫలితాలు (TS SSC Results) విడుదల కానున్నాయి. విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు.
TS 10th Class Results 2024: తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీ అంటే.. రేపు ఉదయం 11.00 గంటలకు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పలితాలను ఆంధ్రజ్యోతి. కామ్ వెబ్సైట్లో క్లిక్ చేసి విద్యార్థులు.. తమ హాట్ టికెట్ ఎంటర్ చేసి.. వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 18వ తేదీన 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. ఏప్రిల్ 2వ తేదీతో ఈ పరీక్షలు ముగిశాయి.