Home » Videos
టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మహిళా నేతలపై వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరకర పోస్టుల చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆ రెండు పార్టీలకు చెందిన మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమిలోని పార్టీల మహిళలపై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఈ విధంగా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందంటూ వారు మండి పడుతున్నారు. ఈ తరహా పోస్టులకు పాల్పడిన వారిని సుమోటో కింద వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
తిరుపతి, కడప జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లను చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. విద్యుత్తు ఉప కేంద్రాన్ని ప్రారంభించి.. సభా వేదిక వద్దకు వెళ్తుండగా.. పక్కనే ఉన్న పెమ్మసానిని ఉద్దేశించి..
జిల్లా సమీక్ష సమావేశం బుధవారం కడపలో జరిగింది. ఈ సమావేశానికి కడప ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు మాధవి రెడ్డితోపాటు మంత్రి సవిత, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం చివరలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్పందించారు. ఈ సమీక్షా సమావేశానికి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు.
మద్దిలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. 12 ఏళ్ల అనంతరం అతడు జైలు నుంచి బయటకు వచ్చారు. ఇటీవల నాంపల్లి కోర్టు భాను కిరణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం జైలు నుంచి భానుకిరణ్ విడుదలయ్యారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మంగళవారం సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌కు వెళ్లారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు గౌడ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ బిర్యానీ తిన్నారు. ఈ సందర్భంగా పలువురు కష్టమర్లు కేటీఆర్‌తో సెల్పీలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నవంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారా? అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే.. ఈ ఏడాది ఎన్నికలు జరగడంతో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాష్ట్ర బడ్జెట్ ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో గత ప్రభుత్వ పాలనలో ఎన్ని నిధులు ఏ ఏ సంక్షేమ పథకాలకు ఖర్చు చేసింది.
పాము కారణంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని కేకే రైల్వే లైన్లో పాము కారణంగా గూడ్స్ రైళ్లు.. కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. 25 కేవీఏ విద్యుత్ లైన్‌పై పాము చిక్కుకుంది. అయితే విద్యుత్ షాక్‌తో ఆ పాము మరణించింది. దీంతో పవర్ ట్రిప్ కావడంతో.. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విద్యుత్ లైన్‌పై చిక్కుకున్న పామును తొలగించి.. విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. దీంతో రైళ్ల రాకపోకలు సజావుగా జరిగాయి.
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీపావళి అనంతరం ఈ ధరలు మరింత పైకి ఎగబాకుతున్నాయి. ఈ సమయంలో మరింతగా పెరుగుతాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం రూ. 2750 డాలర్ల స్థాయిలో ఔన్స్ గోల్డ్ రేట్ ట్రేడ్ అవుతుంది. వచ్చే ఏడాదికి అంటే.. 2025 నాటికి ఈ ధర 3,000 డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలతోపాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపూరీ అర్వింద్ నిప్పులు చెరిగారు. ఆదివారం నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ ధర్మపూరి అర్వింద్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు.
తప్పు చేసిన నిందితులను పట్టుకుని వారిని చట్ట ప్రకారం శిక్షించడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఆడ బిడ్డను సీఎం చంద్రబాబు సొంత బిడ్డలా చూసుకుంటారని ఆమె తెలిపారు. అందుకోసమే.. మహిళలు సాధికారత సాధించాలంటూ గతంలో డ్వాక్రా సంఘాలను గతంలో సీఎం చంద్రబాబు తీసుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే ఆయన హయాంలోనే దీపం పథకం ప్రారంభమైందని తెలిపారు.