Home » Vijaywada West
విజయవాడ అభివృద్దికి సంబంధించి అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్ధేశం చేశారు. నగరంలో పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా జరిగేలా ట్యాంకుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కరుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల వాసులు బిక్కుబిక్కుమంటు ఉంటున్నారు.
విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ మదర్సాలో ఫుడ్ పాయిజన్ జరిగడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 10 మందికి వాంతులయ్యాయి.
ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) వైసీపీ(YSRCP)లోకి వెళ్లిన తర్వాత మరీ తన స్థాయికి దిగజార్చుకుని మాట్లాడుతున్నారని విజయవాడ పశ్చిమ బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి(Sujana Chowdary) అన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలపై సుజనా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని స్థాయికి దిగిజారి తాను మాట్లాడలేనని అన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన - బీజేపీ (Telugu Desam - Janasena - BJP) పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో వేగం పెంచాయి. పొత్తులో భాగంగా అభ్యర్థులను ప్రకటిస్తూ టీడీపీ - జనసేన దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే రెండు జాబితాలను ఈ రెండు పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే.
విజయవాడలో మరోసారి వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోయారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ నేతలపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ఓ కేసు వాయిదా కోసం కోర్టుకు గన్నవరం టీడీపీ (TDP), వైసీపీ నేతలు వచ్చారు. ఈ సమయంలో వైసీపీ నేతలు కోర్టు ఆవరణలో అలజడి సృష్టించారు.
నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి (ఇంద్రకీలాద్రి) 8వ పాలకమండలి సమావేశం సోమవారం నాడు జరిగింది. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశానికి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ రామారావు హాజరయ్యారు.
రామజన్మభూమి అయోధ్యలో రామందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు.
విజయవాడ బందర్ రోడ్డులో సామాజిక న్యాయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహా ప్రారంభోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన ఉండడంతో ఆ ప్రాంతంలో వాహనాల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ డీసీపీ కె.చక్రవర్తి ( DCP K. Chakraborty ) తెలిపారు.
ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరాలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి 5 రోజులపాటు భవానీలు దీక్ష విరమించనున్నారు. ఉదయం 6:30 గంటలకు ఆలయ అర్చకులు అగ్ని ప్రతిష్టాపన చేయనున్నారు. రేపు శత చండీయాగం నిర్వహణ, గిరి ప్రదక్షణ, భవాని దీక్ష విరమణలు చేయనున్నారు. గురు భవానీల చేత ఇరుముడులను సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.