Home » Visaka
విశాఖ: నగరానికి చెందిన లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలినానిపై ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.
రుషి కొండ ప్యాలెస్ నిర్మాణంలో భాగంగా రిసార్టును కూలగొట్టిన సమయంలో అప్పటి అధికారులు ఈ సామగ్రిని ఏం చేశారో వివరించే ఫైల్ ఏదీ అందుబాటులో లేదు. ఈ ఫర్నిచర్ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక ఫైల్ ఏపీటీడీసీ వద్ద ఉండేది. ప్రభుత్వం మారిన తర్వాత అది మాయమైనట్లు తెలుస్తోంది.
తూర్పు తీరానికి మణిహారం విశాఖపట్నం. దేశ రక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. శత్రువులు ఇటువైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేస్తోంది.
విశాఖ- విజయవాడ నగరాల మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీని వల్ల ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చి ఫ్లైట్ ఛార్జీలు తగ్గుతాయని కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ ఎన్నికల ఫలితాలపై స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సైతం స్పందించారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ అవసరం చాలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. విశాఖలోని శారదాపీఠానికి నాటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు... ఉన్నతాధికారులు సైతం క్యూ కట్టారు. అయితే గతంలో విశాఖపట్నం నగర శివారులో ఈ శారదా పీఠం ఉండేది.
విశాఖ లాసన్స్‌బే కాలనీలోని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ ఎంపీ సత్యనారాయణతోపాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలోనూ సోదాలు సాగుతున్నాయి.
విశాఖ ఎన్ఐఏ కోర్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన కోడికత్తి కేసు విచారణకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. జగన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్, ఆయన తరఫు న్యాయవాది సలీం, దళిత సంఘాల నేతలు కోర్టుకు వచ్చారు.
నారా లోకేష్ శుక్రవారం విశాఖలో కోర్టుకు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్న ఆయన పార్టీ కార్యాలయంలో బస చేశారు. ‘చినబాబు చిరుతిండి..25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రోజువారీ కార్యకలాపాలకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. జీతాలు సైతం సగమే చెల్లిస్తు న్నారు. రోజుకు 21 వేల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాల్సిన ప్లాంటులో ఇప్పుడు 4వేల టన్నులకు మించి ఉత్పత్తి జరగడం లేదు.