Home » Warangal
వడ్రంగులు.. ఒకప్పుడు రైతులకు చేదోడువాదోడుగా ఉండే ఓ నేస్తం. తొలకరి ప్రారంభమైందంటే చాలు అన్నదాతలు కాడి, నాగలి, గుంటుక, దంతె లాంటి వ్యవసాయ పనిముట్లు తయారు చేయించుకునేందుకు వడ్రంగుల చుట్టూ తిరిగేవారు. ఒక్కోసారి రోజుల తరబడి వారిచ్చే పనిముట్ల కోసం వేచిచూసేవారు. నాడు అంత బిజీగా కులవృత్తిని నిర్వహించిన వడ్రంగులు.. యాంత్రీకరణ పుణ్యమా అని దుర్భర జీవితం గడుపుతున్నారు. ఉపాధి కోసం నేటి తరం వారిలో కొందరు పట్టణాలకు పయనమైతే.. ఇంకొందరు తమ వృత్తిపరమైన యాంత్రీకరణను అందిపుచ్చుకుంటున్నారు. మిగిలిన వారు అదే కులవృత్తిని కొనసాగిస్తూ గ్రామాల్లో గడుపుతున్నారు. అయితే పరిస్థితుల ప్రభావంపై తమపై తీవ్రంగా పడిందని.. ఎన్నో కుటుంబాలు సరైన ఉపాధికి నోచుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వాలు కుల వృత్తులకు చేయూతనందిస్తామని చెప్పి మొండి చేయి చూపాయని.. ప్రస్తుత ప్రభుత్వమైనా తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రస్తుతం గురుకులాల్లో నెలకొన్న పరిస్థితులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విద్యార్థుల సంక్షేమం గురించి అధికారులు పట్టించుకోవడం లేదని, ఉన్నతా ధికారుల పర్యవేక్షణ కరువైందని, విద్యార్థులకు ఆరో గ్యం, భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రిజర్వాయర్ స్టేషన్ ఘన్పూర్(ఆర్ఎస్)కు ఎట్టకేలకు మోక్షం లభించింది. రిజర్వాయర్ అభివృద్ధికి ఈనెల 27న ప్రభుత్వం 148.76కోట్లను మంజూరు చేసింది. దాంతో వివిఽధరకాల పనులు శరవేగంగా జరగనున్నా యి. నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2004లో అప్పటి భారీ నీటిపారుదలశాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.
గిరిజనులపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపించింది.ఏ ప్రభుత్వానిదైనా ఒకటే తీరన్నట్లు తయారైంది సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలకమండలి సమావేశాలు మూడున్నర ఏళ్లైనా పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ లోగా ఎన్నికలు రావడం..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా పాలకమండలి సమావేశాలపై ఊసే లేకుండా పోయింది.
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రాష్ట్రానికి పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దాదాపు రూ.500 కోట్లతో ఏర్పాటు చేసే కోచ్ ఫ్యాక్టరీతో దాదాపు 2000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి.
ఢిల్లీ పర్యటన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గిరిజన రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకను నిరసిస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాబు నాయక్ తండా గిరిజనులు నిరసన చేపట్టారు. వైద్య కళాశాల కోసం తమ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని.. కేటీఆర్‌కు మహబూబాబాద్‌కు వచ్చే అర్హత లేదని.. కేటీఆర్ గో బ్యాక్... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ మహబూబాబాద్‌లో దర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. షరతులతో కూడిన దర్నాకు అనుమతినిచ్చింది. దీంతో సోమవారం మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహిస్తుంది.
దక్షిణ భారతదేశ రైల్వేకు ముఖద్వారంగా ఉన్న కాజీపేట రైల్వేజంక్షన్ రూపురేఖలు మారనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఓరుగల్లు వాసులు ఎదురుచూస్తున్న కోచ్ ఫ్యాక్టరీతో పాటు రైల్వే డివిజన్ ఏర్పాటుపై అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పనులు వేగంగా జరుగుతుండగా, కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ హోదాతో రైల్వేమ్యాప్లో కాజీపేటకు ప్రత్యేక గుర్తింపు రానుంది.
అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ ప్రజల కల నెరవేరబోతోంది. గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్ లను, మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఘన్‌పూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసింది.