Home » YCP MP Avinash Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.
వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించినా, ఛార్జిషీట్లు దాఖలు చేసినా పోలీసులు మాత్రం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా వెనకడుగు వేస్తున్నారు. అవినాష్ అరెస్టు కాకపోవడానికి బీజేపీ -వైసీపీ మధ్య అనుబంధం కూడా ఒక కారణమని పలువురు అనుమానిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న సూక్తి అవినాష్ రెడ్డి విషయంలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు.
సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కేసు విచారణ నేడు జరిగింది. లాయర్ సిద్ధార్ధ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని సుప్రీంను వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవినాష్ రెడ్డి (YS Avinash reddy) బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో (Supreme court) సీబీఐ (CBI) అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 11న అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్ట్‌లో విచారణ జరగనుంది. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంలో సునీతా రెడ్డి సవాలు చేశారని ప్రస్తావించింది.
వివేకా హత్య కేసులో నేడు సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టుకి హాజరు కావడం ఇది రెండో సారి. ఇప్పటికే వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న వైసీపీ కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సోమవారం సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ఆయన సీబీఐ కోర్టుకి చేరుకున్నారు. గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది...
పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. నేడు అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకాహత్య కేసులో తనను, తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు, వైఎస్ వివేకా కూతురు సునీత, అలాగే బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు రెండేళ్లుగా కుట్ర పన్నారన్నారు.