ముందే చేరితే మేలు

ABN , First Publish Date - 2020-03-03T06:28:05+05:30 IST

వెళ్లవలసిన చోటికి, అనుకున్న సమయానికి చేరాలంటే ప్రణాళిక ఉండాలి. ముఖ్యంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లే పిల్లలు ఇది గుర్తుంచుకోవాలి. ఉదయం లేవడం దగ్గర నుంచి...

ముందే చేరితే మేలు

వెళ్లవలసిన చోటికి, అనుకున్న సమయానికి చేరాలంటే ప్రణాళిక ఉండాలి. ముఖ్యంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లే పిల్లలు ఇది గుర్తుంచుకోవాలి. ఉదయం లేవడం దగ్గర నుంచి అన్ని పనులూ రెగ్యులర్‌ షెడ్యూల్‌ కన్నా అరగంట ముందే పూర్తి చేసేలా ప్రణాళికి వేసుకోవాలి. అలారం పెట్టుకుని సకాలంలో మేలుకోవడంతో పాటు, స్నానం, బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం, సంక్షిప్తంగా రాసుకున్న సినాప్సి్‌సలపైన ఒకసారి దృష్టి సారించడం... ఇవన్నీ ఒక  క్రమానుగతంగా జరిగిపోవాలి. ఈ విషయంలో తల్లితండ్రులు అందించే తోడ్పాటు, పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చేస్తాయి.


ఇవి గుర్తుంచుకోండి... 

ఉదయం ఏ నాలుగింటికో లేవాలని చెప్పడంతో అయిపోదు. అందుకు అనుగుణంగా రాత్రివేళ కాస్త తొందరగానే పడుకునేలా చూడాలి.  

రాత్రివేళ తొందరగా పడుకోవాలంటే, ముందే అన్ని పాఠాలకు సంబంఽధించిన సినాప్సిస్‌లు (క్లుప్త పాఠాలు) వారికి అందుబాటులో ఉంచాలి. 

పరీక్షల వేళల్లో... ప్రత్యేకించి రాత్రివేళ విటమిన్లు, లవణాలు పుష్కలంగా ఉన్న ద్రవాహారం ఇవ్వడం మేలు. ఘనాహారం ఇస్తే, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. 

ప్రశ్నలో నుంచే సగం సమాధానం లభిస్తుంది. ప్రశ్నను ఎన్ని రకాలుగా తిప్పి ఇస్తారోననే బెంగ పిల్లల్లో రాకుండా చూడాలి. పాఠ్యాంశాల్ని సమగ్రంగా చదివిన తర్వాత, ప్రశ్న ఎలా వచ్చినా సమాధానం రాయడం కష్టం కాదనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెబుతూ ఉండాలి.  

ప్రణాళికా బద్ధంగా, అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాంతో చదివిన విషయాల్ని గుర్తు చేసుకోవడం గానీ, వాటిని అర్థవంతంగా ప్రజెంట్‌ చేయడం గానీ సులువవుతుంది.  

ఎంత బాగా చదివిన వారికైనా, పరీక్షా హాల్‌లోకి ప్రవే శించగానే లోపల కొంత అలజడిగా ఉంటుంది. కాక పోతే అది ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఉంటుందని పిల్లలకు చెప్పాలి. 

మొదటి రోజు నుంచే పిల్లలు కచ్చితంగా పరీక్ష హాలు వద్దకు అరగంట ముందే చేరేలా చూడడం తల్లితండ్రుల బాధ్యత.

Updated Date - 2020-03-03T06:28:05+05:30 IST