అతి పొడవైన వాటర్‌ స్లైడ్‌

ABN , First Publish Date - 2020-03-08T06:17:42+05:30 IST

అమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో వాటర్‌ స్లైడ్‌లపై ఎంజాయ్‌ చేసుంటారు కదా! వాటర్‌ స్లైడ్‌ ఎక్కితే కొన్ని సెకన్లలోనే జారుకుంటూ నీళ్లలో పడిపోతారు. కానీ మలేసియాలో ఉన్న వాటర్‌స్లైడ్‌ ఎక్కితే నాలుగు నిమిషాల...

అతి పొడవైన వాటర్‌ స్లైడ్‌

అమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో వాటర్‌ స్లైడ్‌లపై ఎంజాయ్‌ చేసుంటారు కదా! వాటర్‌ స్లైడ్‌ ఎక్కితే కొన్ని సెకన్లలోనే జారుకుంటూ నీళ్లలో పడిపోతారు. కానీ మలేసియాలో ఉన్న వాటర్‌స్లైడ్‌ ఎక్కితే నాలుగు నిమిషాల పాటు మీరు స్లైడ్‌పై జారిపోతూనే ఉంటారు. చివరగా పెద్ద స్విమ్మింగ్‌పూల్‌లో పడతారు. 1140 మీటర్ల పొడవు ఉన్న దీనికి ‘వరల్డ్‌ లాంగెస్ట్‌ వాటర్‌ స్లైడ్‌’గా గుర్తింపు ఉంది.  గత ఏడాది ఆగస్టులో పెనాంగ్‌ ఎస్కేప్‌ థీమ్‌ పార్క్‌లో దీన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు న్యూజెర్సీలో ఉన్న వాటర్‌స్లైడ్‌ అతి పొడవైన స్లైడ్‌గా రికార్డుల్లో నమోదయింది. దాని పొడవు 605 మీటర్లు. ఇప్పుడు మలేసియాలో ప్రారంభమైన ఈ స్లైడ్‌ ఆ రికార్డును బద్దలుకొట్టింది. 

Updated Date - 2020-03-08T06:17:42+05:30 IST