ఇది ‘పేపర్ టవల్ ఛాలెంజ్’!
ABN , First Publish Date - 2020-03-13T06:48:17+05:30 IST
సోషల్ మీడియాలో రోజుకో వింత ట్రెండ్ వెలుగు చూస్తోంది. ప్రస్తుతం ‘టిక్‌టాక్’లో చాలామంది ‘పేపర్ టవల్ ఛాలెంజ్’ విసురుతున్నారు. వీటిలో నిగూఢంగా ఉన్న సందేశాలు నీళ్లు తగలగానే కనిపించి నవ్వు...
సోషల్ మీడియాలో రోజుకో వింత ట్రెండ్ వెలుగు చూస్తోంది. ప్రస్తుతం ‘టిక్‌టాక్’లో చాలామంది ‘పేపర్ టవల్ ఛాలెంజ్’ విసురుతున్నారు. వీటిలో నిగూఢంగా ఉన్న సందేశాలు నీళ్లు తగలగానే కనిపించి నవ్వు తెప్పిస్తుంటాయి. పేపర్ నాప్కిన్ను సగానికి మడత పెట్టి, పై భాగంలో ఒక రకం అర్థం వచ్చేలా, వెనుక వైపు అదే సందేశం మరొక అర్థం వచ్చేలా రాస్తారు. ముందుగా నాప్కిన్ పై భాగంలో ఉండే సందేశం కనిపిస్తుంది. నాప్కిన్ను వాష్బేసిన్లోగానీ, బయటగానీ నీటిలో తడపగానే వెనుక ఉన్న అక్షరాలతో కలిసి నవ్వు పుట్టించే సందేశం ప్రత్యక్షమవుతుంది. ఉదాహరణకు నాప్కిన్ పైన ‘విల్ యూ ఎం’ అని రాయగానే ‘మ్యారీ మీ’ అని ఉంటుందేమో అనుకుంటారు. కానీ నీటిలో తడవగానే ‘మేక్ మీ ఏ శాండ్విచ్’ అని కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ‘పేపర్ టవల్ ఛాలెంజ్’ విపరీతంగా వైరల్ అవుతోంది.