నిజాయితీ ఉండాల్సింది మనలోనే

ABN , First Publish Date - 2020-02-08T01:42:58+05:30 IST

ఏసీబీ డీజీ ఉద్యోగం ఎలా ఉంది? నేను ఏసీబీ డీజీగా వచ్చే సరికే.. చాలా వివాదాస్పదమైన ‘మద్యం సిండికేట్ల’ కేసు విచారణలో ఉంది. దానికి ఓ కొలిక్కి తీసుకురావడానికే నాలుగైదు నెలలు పట్టింది.

నిజాయితీ ఉండాల్సింది మనలోనే

ఒత్తిడి చేస్తే.. తప్పు చేశామనడం అవాస్తవం

వ్యవస్థలో మార్పుతోనే అవినీతి అంతం

రాజకీయంగా బలమైన నిర్ణయం ఉండాలి

ప్రభుత్వ విభాగాల్లోనూ కొంత వరకు కుల వివక్ష

4-3-2013న ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో ఏసీబీ డీజీ ప్రసాదరావు


ఏసీబీ డీజీ ఉద్యోగం ఎలా ఉంది?

నేను ఏసీబీ డీజీగా వచ్చే సరికే.. చాలా వివాదాస్పదమైన ‘మద్యం సిండికేట్ల’ కేసు విచారణలో ఉంది. దానికి ఓ కొలిక్కి తీసుకురావడానికే నాలుగైదు నెలలు పట్టింది. సాధారణంగా మూడు రకాలుగా కేసులను చేపడతాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడం. ఆదాయానికి మించి ఆస్తులున్న వారి పై దాడులు.. మూడోది కమీషన్లు తీసుకోవడం, లబ్ధి పొందడం, లేక కలిగించడం వంటివి చేసిన అధికారులపై కేసులు పెట్టడం. ఇందులో ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్న వారిపై చర్యలు తీసుకోవడం కష్టతరం. అక్రమ ఆస్తులను బంధువుల పేరిట పెడుతుంటారు. వాటిని ఛేదించడానికి చాలా సమయం పడుతుంది.

 

ఏసీబీ డీజీగా చెప్పండి.. అవినీతి అరికట్టడం సాధ్యమేనా?

ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతిని అరికట్టడం అంత సులభం కా దు. విలువలు బాగా దెబ్బతిన్నాయి. ఒకప్పుడు 10 శాతం మంది అవినీతికి పాల్పడితే.. ఇప్పుడు 90 శాతం మంది ఎంతో కొంత అ వినీతికి పాల్పడుతున్నారు. ప్రజలు కూడా దీనికి అలవాటుపడి పోయారు. భూమి మ్యుటేషన్‌ చేయాలన్నా అధికారులు పర్సంటేజీలు అడిగేంత వరకూ వచ్చింది.

 

మరి అవినీతిని అరికట్టడమెలా?

ముందు రాజకీయంగా బలమైన నిర్ణయం ఉండాలి. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించమనే సందేశం వెళ్లాలి. వ్యవస్థల్లో పలు మార్పులు తేవాలి. ఈసేవ, మీసేవ, సెల్‌ఫోన్ల ద్వారా చెల్లింపులు వంటి సాంకేతిక ప్రక్రియలను ప్రభుత్వ వ్యవహారాల్లో తీసుకురావాలి. అధికారులతో సరాసరిన పని ఉండకపోవడం వల్ల అవినీతి నియంత్రణలో ఉంటుంది.

 

పెద్ద ఉద్యోగులను వదిలేస్తారనే విమర్శలు?

అలాంటిదేమీ ఉండదు. ఎవరిపైనైనా ఫిర్యాదు వస్తే.. ముందు అది ఎంతవరకు వాస్తవం, ఆ అధికారి వ్యవహారశైలి ఎలాంటిది అ నేది పరిశీలిస్తాం. ఆ తర్వాత పని మొదలు పెడతాం. చిన్న స్థాయి అధికారులు సరాసరిన ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి దొరికిపోతారు. అదే ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు, ఇత ర పెద్దవారితో సంబంధాలుంటాయి. ఇద్దరికీ లాభం చేకూరేలా ‘క్వి డ్‌ ప్రోకో’ ఉంటుంది. దాంతో ఫిర్యాదులుండవు. దొరకడం కష్టం.

 

ఒకవైపు పోలీస్‌, మరోవైపు భాషావేత్త, శాస్త్రవేత్త.. ఇవన్నీ ఎలా?

ఎంత ఒత్తిడితో ఉన్న ఉద్యోగమైనా కొంతైనా ఖాళీ సమయం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలని నేను కాలేజీ లో ఉన్నప్పుడే పురుషోత్తం అనే ఇంగ్లీషు లెక్చరర్‌ చెప్పారు. అది మనసులో నాటుకుంది. నేను సర్వీస్‌లో చేరిన తర్వాత ఇంగ్లీష్‌పై పట్టుకోసం బాగా కష్టపడ్డాను. ఎన్నో పుస్తకాలు చదివి, వొ కాబులరీ ప్రాక్టీసు చేశాను. ఆ తర్వాత పరిశోధనపైకి దృష్టి మళ్లింది.

 

మరి శాస్త్రవేత్తగా ఉండి ఐపీఎస్‌వైపు ఎందుకు వెళ్లారు?

అప్పట్లో సివిల్‌ సర్వీసులకు ఉన్న ఆకర్షణ అలాంటిది. మా నాన్న కానిస్టేబుల్‌. మా అంకుల్‌ టీచర్‌గా ఉండేవాడు. మిలటరీలో కూడా పనిచేసిన ఆయన నన్ను ప్రోత్సహించారు. ఆ దారిలోనే సివిల్స్‌ రాసి ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. నాకు 1977లోనే.. రీసెర్చ్‌ స్కాలర్‌గా అవకాశం వచ్చినా.. అది వదిలేసి ఇటు వచ్చా ను. కానిస్టేబుల్‌ కొడుకునై ఉండీ.. ఐపీఎస్‌ అయినందుకు నాన్న ఎంతగానో పొంగిపోయారు. హైదరాబాద్‌ కమిషనర్‌గా పనిచేయడం చాలా కష్టమనిపించింది.

 

ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేయడం సాధ్యమా?

ఐఏఎస్‌, ఐపీఎస్‌లాంటి అధికారులెవరైనా వారి పని వారు చే సుకోవచ్చు. ఎవరూ వారిని ఇబ్బంది పెట్టలేరు. ఏదైనా తప్పిదాని కి పాల్పడి.. ఎవరిదో ఒత్తిడి వల్లే అలా చేశామని చెప్పుకోవడం సరికాదు. ఎవరు ఏ పని చేయాలనే నిబంధనలు ఉంటాయి. వాళ్లు ని జాయితీగా ఉండాలనుకుంటే ఎవరూ ఒత్తిడి చేయలేరు.

 

మీపై ఎప్పుడైనా ఒత్తిళ్లు వచ్చాయా?

ఒత్తిళ్లు చాలా సమయాల్లో వస్తుంటాయి. అధికారం లో ఉన్నవాళ్లు ఎక్కువగా ఒత్తిడి చేస్తారు. ఎవరైనా ఏదై నా కావాలన్నప్పుడు.. వివరించి చూస్తాను. లేకపోతే వా రికేం కావాలో రాసిమ్మని చెబుతాను. అలా రాసివ్వలేరు.. వినకపోవడంతో తప్పించాలని చూస్తారు. విశాఖలో ఉ న్నప్పుడు ఓ సారి నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. ఈ ఉద్యోగం ఇక్కడ కాకపోతే ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ, తప్పు చేసి నష్టపోవడం ఎందుకనే పద్ధతి నాది.

 

నేరస్తుల్లో మార్పుతేవడంపై దృష్టిపెడతారా?

నేరాలు చేసేవారిలో చాలా మంది పరిస్థితుల ప్రభావం వల్లే అలా చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు, తండాల్లోని వారంతా నేరాలకు పాల్పడుతుంటారు. అలాంటివారికి మంచి పరిస్థితుల కల్పించి, వారి పిల్లలకు చదువు చెప్పిస్తే పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇలా నేను పనిచేసిన రెండు మూడు చోట్ల చేసి చూశాను. వారిలో చాలా మార్పు వచ్చింది కూడా.

 

ఇటీవలి పేలుళ్ల వంటివాటిని నియంత్రించడం సాధ్యమేనా?

అటువంటి వాటిని నిరోధించడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఎక్కడో ఒక చోట పేల్చాలని ఉగ్రవాదులు భావిస్తే.. ఆపడం కొంత కష్టం. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ఔట్‌పోస్టులు ఏర్పాటు చేసి అప్పుడప్పుడూ చెక్‌ చేస్తుంటే.. చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అయితే.. హైదరాబాద్‌లో పోలీసుల సంఖ్య చాలా తక్కువ. దీనిని బాగా పెంచాల్సి ఉంది. ఎనిమిది గంటల డ్యూటీని అమలు చేయడం వల్ల పోలీసులకు విశ్రాంతి లభించి, చురుగ్గా పనిచేస్తారు. ప్రజలు కూడా కొంత బాధ్యతగా వ్యవహరిస్తే ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించొచ్చు.

 

డిపార్ట్‌మెంట్‌లో కుల వివక్ష ఎదుర్కొన్నారా?

మా కులం ఇది కాబట్టి వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం సాధారణంగా అధికారుల్లో ఉంటుంది. కానీ, కష్టపడి పనిచేసేవారికి సరైన ప్రాధాన్యత లభిస్తుంది. అయితే.. దళిత పోలీసులు మిగతా వారి కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఇది ఒక రకమైన మానసిక సమస్య. సమాజంలో మొదటి నుంచీ ఉన్న పరిస్థితులు ఈ రకమైన ప్రభావం చూపుతాయి. ఈ వర్గాలకు చెందినవారు ఎంతగా ఎదిగినా.. ఇతరులు వ్యవహరించే పద్ధతిని బట్టి కొంత వరకు ‘మానసిక కుంగుబాటు’ ఉంటుంది.

 

మీకు ఇంకా ఎంత సర్వీస్‌ ఉంది?

ఇంకా రెండున్నరేళ్ల పాటు సర్వీస్‌ ఉంది. ఇప్పుడున్న సీనియర్లలో ఒకడిని. డీజీపీ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే రాషా్ట్రనికి తొలి దళిత డీజీపీ అవుతాను.

Updated Date - 2020-02-08T01:42:58+05:30 IST