పిల్లల స్ర్కీన్ పరిమితి ఇలా...
ABN , First Publish Date - 2021-05-27T05:30:00+05:30 IST
ఇళ్లకే పరిమితమైన పిల్లలు కాలక్షేపం కోసం సెల్ ఫోన్లు, కంప్యూటర్లతో ఎక్కువ కాలం గడిపేస్తూ ఉన్నారు. అలాగని ఆ గ్యాడ్జెట్స్‌ను వాళ్ల చేతుల్లో నుంచి లాగేసుకుంటే పిల్లలు
ఇళ్లకే పరిమితమైన పిల్లలు కాలక్షేపం కోసం సెల్ ఫోన్లు, కంప్యూటర్లతో ఎక్కువ కాలం గడిపేస్తూ ఉన్నారు. అలాగని ఆ గ్యాడ్జెట్స్‌ను వాళ్ల చేతుల్లో నుంచి లాగేసుకుంటే పిల్లలు నొచ్చుకోవడం ఖాయం. కాబట్టి వాళ్ల స్ర్కీన్ టైమ్‌ను నియంత్రించడం కోసం పెద్దలు కొన్ని తెలివైన ఎత్తుగడలు అమలు చేయాలి. అవేంటంటే...
మెచ్చుకోలుగా: పిల్లలు వాళ్ల చదువులో/పరీక్షల్లో చక్కటి పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తే, బహుమానంగా కొంత ఎక్కువ స్ర్కీన్ టైమ్‌కు అనుమతించవచ్చు. ఇలాంటి ఎత్తుగడతో చదువు పట్ల పిల్లల ఆసక్తి పెంచవచ్చు. గ్యాడ్జెట్స్ వాడకాన్ని నియంత్రించవచ్చు.
పేచీ లేకుండా తింటే: పిల్లలు తిండి విషయంలో పేచీలు పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు భోజనం పూర్తిగా తినేస్తే, కొంతసేపు గ్యాడ్జెట్స్ వాడుకోవడానికి అనుమతిస్తానని చెప్పవచ్చు.
పెద్దల పర్యవేక్షణ: పిల్లలు కంప్యూటర్, మొబైల్ ఫోన్లతో గడిపే సమయం పెద్దల పర్యవేక్షణలోనే సాగాలి. అనుమతించిన సమయం ముగియగానే, పిల్లల నుంచి గ్యాడ్జెట్స్ పెద్దలు తీసేసుకోవాలి. ఎంత మారాం చేసినా, మెత్తబడిపోకూడదు.
స్ర్కీన్ టైమ్ తగ్గించడం కోసం అంతకంటే ఎక్కువ కాలక్షేపాన్ని అందించే ఆటపాటల్లో పిల్లలను భాగస్వాములను చేయాలి. డాన్స్ వీడియోలు ప్లే చేసి, పిల్లల చేత డాన్స్ చేయించగలిగితే, వాళ్లకు వ్యాయామం చేసిన ఫలం కూడా దక్కుతుంది. పెయింటింగ్, అంత్యాక్షరి, మ్యూజికల్ ఛెయిర్స్ లాంటివీ పిల్లలకు చక్కని కాలక్షేపాన్ని అందిస్తాయి.