పూబంతులు

ABN , First Publish Date - 2021-04-07T05:30:50+05:30 IST

పువ్వులు చూస్తే పరవశించని మనసు ఉంటుందా! అందునా మగువలైతే..! పూదోటలు పలుకరిస్తే..!

పూబంతులు

పువ్వులు చూస్తే పరవశించని మనసు ఉంటుందా! అందునా మగువలైతే..! పూదోటలు పలుకరిస్తే..! ఇదిగో ఇలా తమను తాము మరిచిపోతారు. ఆ పరిమళాలను ఆస్వాదిస్తూ... వాటి మృదువైన స్పర్శకు పులకరిస్తూ... సెల్ఫీలతో గోల చేస్తారు. మొదటి చిత్రం... పూదోటలకు ప్రసిద్ధి 

పొందిన కాలిఫోర్నియా (అమెరికా)లోని కార్ల్స్‌బాడ్‌ నగరంలోనిది. ఇటీవలే అక్కడి ఫ్లవర్‌ ఫీల్డ్స్‌ను సందర్శకుల కోసం తెరిచారు. నారింజ, గులాబీ, పసుపు, ఊదా రంగుల్లో పుష్పాలు అలరిస్తున్నాయి. ఇక రెండో చిత్రం... జపాన్‌ ప్రజల సంప్రదాయ సంబరం ‘చెర్రీ బ్లూసమ్‌’లోనిది. అక్కడి క్యోటో నగరంలో ఆహ్లాదం పంచుతున్న చెర్రీ పువ్వులు... వాటితో తమ అనుబంధాన్ని ‘లెన్స్‌’లో బంధిస్తున్న యువతులు.

Updated Date - 2021-04-07T05:30:50+05:30 IST