జరగాల్సింది జరిగింది.. అదంతా నా ఖర్మ.. ఓపెన్‌హార్ట్‌లో శరత్ కుమార్ కామెంట్స్..

ABN , First Publish Date - 2021-11-11T23:02:46+05:30 IST

దాదాపు 130కి పైగా సినిమాల్లో నటించిన తమిళ హీరో, నిర్మాత, గాయకుడిగా గుర్తింపు పొందిన శరతకుమార్ ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడమనేది రాజకీయాల్లోకి

జరగాల్సింది జరిగింది.. అదంతా నా ఖర్మ.. ఓపెన్‌హార్ట్‌లో శరత్ కుమార్ కామెంట్స్..

దాదాపు 130కి పైగా సినిమాల్లో నటించిన తమిళ హీరో, నిర్మాత, గాయకుడిగా గుర్తింపు పొందిన శరత్ కుమార్ ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడమనేది రాజకీయాల్లోకి వెళ్లడానికి గ్రీన్ కార్డ్ లాంటిదని ఎవరైనా అంటే దానిని వ్యతిరేకిస్తానని ఆయన తెలిపారు. జయలలితతో తనకు విభేదాలు ఎందుకు వచ్చాయనేది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయన వివరించాడు. భవిష్యత్తులో డీఎంకేలో చేరడంపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎలక్షన్స్‌లో 150 కోట్లు తినేశారని వచ్చిన ఆరోపణపై శరత్ స్పష్టతనిచ్చారు. 


తనకెవ్వరూ శత్రువులు లేరని, జరగాల్సింది జరిగిందని అదంతా తన ఖర్మ అని ఆయన అన్నారు. నటి రాధికాను వివాహం చేసుకున్న శరత్ ఇంట్లో ఆమె అధికారమే చెలాయిస్తుందా? అని ఆర్కే అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఆమె విషయంలో తనే కొంచెం తగ్గుతానని తెలిపారు. కూతురి ప్రేమ వ్యవహారంలో జరిగిన ఇష్యూపై మీరేం స్పందించలేదా? మొదటి భార్యతో విభేదాలు రావడానికి కారణమేంటి? ఇలాంటి అనేక ఆసక్తికర ప్రశ్నలకు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని శరత్ వివరించారు. ఆ కార్యక్రమం పూర్తి వివరాలు ఈ ఆదివారం రాత్రి 8.30గంటలకు మీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో..

Updated Date - 2021-11-11T23:02:46+05:30 IST