రొయ్యల నూడుల్స్‌

ABN , First Publish Date - 2021-09-18T19:11:24+05:30 IST

టైగర్‌ రొయ్యలు - నాలుగు, రైస్‌ నూడుల్స్‌ - ఒక ప్యాకెట్‌, నూనె - సరిపడా, నిమ్మరసం - పావుకప్పు, ఎండుమిర్చి - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉప్పు - సరిపడా, మిరియాలు - నాలుగైదు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, టూత్‌ పిక్స్‌

రొయ్యల నూడుల్స్‌

కావలసినవి: టైగర్‌ రొయ్యలు - నాలుగు, రైస్‌ నూడుల్స్‌ - ఒక ప్యాకెట్‌, నూనె - సరిపడా, నిమ్మరసం - పావుకప్పు, ఎండుమిర్చి - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉప్పు - సరిపడా, మిరియాలు - నాలుగైదు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, టూత్‌ పిక్స్‌ - నాలుగు(పొడవైనవి)


సాస్‌ కోసం : నిమ్మరసం - పావుకప్పు, ఫిష్‌ సాస్‌ - రెండు టీస్పూన్లు, వెల్లుల్లి - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, పంచదార - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత. 


తయారీ విధానం: రొయ్యలను శుభ్రంగా కడిగి నిమ్మరసం, దంచిన ఎండుమిర్చి, వెల్లుల్లి, మిరియాలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి మారినేట్‌ చేసుకోవాలి. నూడుల్స్‌ను ఉడికించి పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో ఫిష్‌సాస్‌ తీసుకుని అందులో నిమ్మరసం, దంచిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి, పంచదార, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి సాస్‌ తయారుచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మారినేట్‌ చేసి పెట్టుకున్న రొయ్యలకు టూత్‌పిక్స్‌ గుచ్చాలి. తరువాత వాటిచుట్టూ నూడుల్స్‌ చుట్టాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక డీప్‌ ఫ్రై చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.




Updated Date - 2021-09-18T19:11:24+05:30 IST