వెజ్ పాడ్ థాయ్
ABN , First Publish Date - 2021-09-18T19:03:10+05:30 IST
రైస్ నూడుల్స్ - ఒక ప్యాకెట్, సాస్ కోసం : పంచదార - మూడు టేబుల్‌స్పూన్, వెజిటబుల్ స్టాక్ - పావు కప్పు, సోయా సాస్ - మూడున్నర టేబుల్‌స్పూన్లు, చింతపండు గుజ్జు - రెండు టేబుల్‌స్పూన్లు, చిల్లీ సాస్ - ఒక టీస్పూన్, చిల్లీ ఫ్లేక్స్
కావలసినవి: రైస్ నూడుల్స్ - ఒక ప్యాకెట్, సాస్ కోసం : పంచదార - మూడు టేబుల్‌స్పూన్, వెజిటబుల్ స్టాక్ - పావు కప్పు, సోయా సాస్ - మూడున్నర టేబుల్‌స్పూన్లు, చింతపండు గుజ్జు - రెండు టేబుల్‌స్పూన్లు, చిల్లీ సాస్ - ఒక టీస్పూన్, చిల్లీ ఫ్లేక్స్ - ఒక టీస్పూన్. ఫ్రై కోసం : నూనె - సరిపడా, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, ఉల్లిపాయ - ఒకటి, టోఫు - అర కప్పు, బొక్ చొయ్ - నాలుగు ఆకులు(దీనికి బదులుగా క్యాబేజీ కూడా వాడుకోవచ్చు), మొలకెత్తిన గింజలు - రెండు కప్పులు, వేగించిన వేరుశనగలు - పావు కప్పు, కొత్తిమీర - గార్నిష్ కోసం కొద్దిగా, నిమ్మకాయ - ఒకటి.
తయారీ విధానం: స్టవ్‌పై ఒక పాత్రపెట్టి నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో నూడుల్స్ వేయాలి. ఐదారు నిమిషాలు ఉడికిన తరువాత నూడుల్స్‌లో నుంచి నీళ్లు తీసేయాలి. తరువాత చల్లటి నీళ్లతో ఒకసారి కడిగి పక్కన పెట్టాలి. ఒక బౌల్‌లో వెజిటబుల్ స్టాక్ తీసుకుని అందులో సోయాసాస్, పంచదార, చింతపండు గుజ్జు, చిల్లీసాస్, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకొని సాస్ రెడీ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, దంచిన వెల్లుల్లి వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత బొక్ చొయ్ ఆకులు వేసి వేగించాలి. ఆకులు మెత్తగా ఉడికిన తరువాత టోఫు వేసి కలుపుకోవాలి. తరువాత నూడుల్స్ వేసి కలియబెట్టాలి. సాస్ వేసి అంతగా సమంగా కలిసేలా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. చిన్నమంటపై వేగనివ్వాలి. నూడుల్స్ బాగా ఫ్రై అయిన తరువాత స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. మొలకెత్తిన గింజలు, వేగించిన వేరుశనగలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకోవాలి.