The Real Yogi: పవన్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-12-17T21:29:00+05:30 IST

జనసేన (Janasena) అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

The Real Yogi: పవన్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan, Nagababu

హైదరాబాద్‌: పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలో చేరి ఉంటే ఏదో ఒక పదవి వచ్చి ఉండేదని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. అయితే పవన్ అలా చేయకుండా అవినీతిపరులను నిలదీయడానికే జనసేన పార్టీ పెట్టారని చెప్పారు. రాజకీయాల ద్వారా కోట్ల మందికి సాయం చేయవచ్చనే సంకల్పంతో పార్టీ పెట్టారని చెప్పారు. మనిషి ఎలా బతకాలన్నదానిపై పవన్ మంచి స్పీచ్ ఇచ్చాడని, ప్రతి మనిషికి ఓ లక్ష్యం ఉండాలని కోరుకుంటాడని నాగబాబు చెప్పారు. జనసేన (Janasena) అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై రచయిత గణ రాసిన ది రియల్ యోగి పుస్తకావిష్కరణ సభలో నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ ప్రసాద్ ల్యాబ్స్‌లో నాగబాబు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.

‘‘ది రియల్ యోగి (The Real Yogi) పుస్తకాన్ని ఒక కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ బాబు (Kalyan Babu) గురించి రచయిత గణ అద్భుతంగా రాశారని, కళ్యాణ్ బాబు గురించి తాను ఏం అనుకుంటానో దగ్గరదగ్గరగా అలానే రాశాడని నాగబాబు మెచ్చుకున్నారు.

నాగబాబు ఇంకా ఏమన్నారంటే!

‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని చదివాను. రచయిత గణకి అభినందనలు. ఈ పుస్తకం ఏకబిగిన చదివించింది. శ్రీకాంత్ రిష అద్భుతమైన చిత్రాలు గీశారు. గణ అద్భుతంగా రాశారు. తెలుగులో ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఒక కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ బాబు గురించి గణ అద్భుతంగా రాశారు. కళ్యాణ్ బాబు గురించి నేను ఏం అనుకుంటానో దగ్గరదగ్గరగా అలానే రాశాడు గణ. అందుకే ఈ పుసక్తం ఇంకా నచ్చింది. కళ్యాణ్ బాబు గ్రేట్ మోటీవెటర్. తన దగ్గర వున్నది ఇచ్చేయడమే కళ్యాణ్ బాబుకి తెలుసు. కళ్యాణ్ బాబు ఆలోచన ధోరణి చిన్నప్పటి నుండే భిన్నంగా వుండేది. సినిమాలకి రాకముందే కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావని అన్నయ్య అడిగితే.. ‘క్యాలిటీగా వుండే సినిమాలు ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చాలు’ అన్నాడు. తను హీరో అయిన తర్వాత కూడా ఇదే పాటిస్తున్నాడు. ఎదుటి వాడు బాధలో వుంటే తను హాయిగా ఉండలేడు. ‘రుద్రవీణ’ (Rudraveena) అన్నయ్య చేసిన సూర్యం పాత్ర రియల్ లైఫ్‌లో కళ్యాణ్ బాబుది. ‘సంపాదన నాకు తృప్తిని ఇవ్వడం లేదు. ఎదుటి వాడు బాధలో వుంటే నేను సంతోషంగా ఉండలేను’ అని కామన్ మాన్ ప్రొటక్షన్ ఫోర్స్ పెట్టినపుడే చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడో ఇప్పుడూ అదే చెబుతున్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే వున్నాడు. మరో నాలుగు, నలభై ఏళ్ల తర్వాత కూడా అలానే ఉంటాడు.. దటీజ్.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). తన జీవితం పూలపాన్పు కాదు. తను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు. లంచగొండి తనంతో సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్న రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న అవినీతి, లంచగొండి రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయడానికి జనసేన పార్టీ పెట్టాడు. పైసా కూడా లేకుండా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడిపోయే వ్యక్తిత్వం కళ్యాణ్ బాబుది. తన భవిష్యత్ గురించి ఆలోచన వుండదు. ఇవన్నీ ఒక యోగి, మానవునికి ఉండాల్సిన లక్షణమా అనవసరం. ఒక మనిషిగా కళ్యాణ్ బాబు నాకు చాలా నచ్చుతాడు. కళ్యాణ్ బాబులా వుండాలి కదా.. కానీ నేను అలా ఉండలేకపోతున్నానని చాలాసార్లు అనుకుంటాను. తన పిల్లలపై వున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు అన్నీ తీసేసి జనసేన పార్టీ (Janasena Party) పెట్టాడు. ప్రజలందరికీ పెద్ద ఎత్తున సేవ చేయాలని రాజకీయాన్ని వేదికగా ఎంచుకున్నాడు. తెలుగులో తను టాప్ హీరో. ఫైనాన్సియల్‌గా చూస్తే ఏమీ లేదు. కానీ ఒక మనిషిగా ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంటాడు. ఈ పుస్తకంలో గణ, కళ్యాణ్ బాబుని ఎక్కడా గాడ్లీ పర్సన్‌గా హైలెట్ చేయడానికి ప్రయత్నించలేదు. ఈ పుస్తకం ఎంత హిట్ అవుతుందో లేదో తెలీదు కానీ .. అందరూ ఒకసారి చదవాల్సిన పుస్తకం ఇది’’ అని నాగబాబు అన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, బాబీ కొల్లి, తనికెళ్ళ భరణి, పుస్తక రచయిత గణ, శ్రీకాంత్ రిష, సాహి సురేష్, శైలా తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-17T22:50:09+05:30 IST