Rambha: రంభ కారుకి యాక్సిడెంట్.. చిన్న కూతురికి సీరియస్

ABN , First Publish Date - 2022-11-01T11:29:11+05:30 IST

చిరంజీవి, నాగార్జున వంటి టాప్ హీరోల పక్కన హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందిన నటి రంభ. ఓ దశలో టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది.

Rambha: రంభ కారుకి యాక్సిడెంట్.. చిన్న కూతురికి సీరియస్

చిరంజీవి, నాగార్జున వంటి టాప్ హీరోల పక్కన హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందిన నటి రంభ. ఓ దశలో టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. అనంతరం కెనడాకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యిపోయింది. ఆమె కారుకి తాజాగా ప్రమాదం జరిగింది. దాంతో కారులో ఉన్న రంభ, ఆమె పెద్ద కూతురు, అలాగే ఆమె నానీకి స్పల్ప గాయాలు అయ్యాయి. కానీ చిన్న కూతురు సాషాకి తీవ్రగాయాలు అవ్వడంతో హాస్పిటల్‌కి తరలించారు. సాషాకి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ విషయం తెలుపుతూ నటి రంభ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

అందులో.. ‘నా కూతుర్లను స్కూల్ నుంచి తీసుకొస్తుండగా.. ఓ జంక్షన్ వద్ద మా కారుని మరో కారు ఢికొట్టింది. అప్పుడు నేను నా పిల్లలు, అలాగే నా నానీ కూడా నాతోనే ఉన్నారు. అందరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. కానీ నా కూతురు సాషా ఇంకా హాస్పిటల్‌లోనే ఉంది. మా బ్యాడ్ టైమ్. దయచేసి మా కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలు మాకు చాలా ముఖ్యం’ అని రాసుకొచ్చింది.

Updated Date - 2022-11-01T13:42:11+05:30 IST