World Childrens Day: చారిత్రక కట్టడాలన్నీ నీలం రంగులోకి మారుతున్నాయ్.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2022-11-14T14:21:17+05:30 IST

అనేక కట్టడాలు, భవనాలు, వంతెనలు దేశవ్యాప్తంగా నీలం రంగులోకి మారుతున్నాయ్. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాగే జరుగుతోంది.

World Childrens Day: చారిత్రక కట్టడాలన్నీ నీలం రంగులోకి మారుతున్నాయ్.. ఎందుకో తెలుసా?
World Childrens Day

హైదరాబాద్: పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, కుతుబ్ మినార్, చార్‌మినార్, హౌరా బ్రిడ్జ్ ఇలా అనేక కట్టడాలు, భవనాలు, వంతెనలు దేశవ్యాప్తంగా నీలం (Blue) రంగులోకి మారుతున్నాయ్. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాగే జరుగుతోంది. మన దేశంలో వందలాది కట్టడాలు, భవనాలు నీలం రంగులోకి మారాయి. నిజానికి అవి రంగు మారడం లేదు. లైటింగ్ ఎఫెక్ట్‌తో భవనాలు, కట్టడాలు నీలం రంగులో కనపడేలా చేస్తున్నారు. ఈ వారమంతా అవి నీలం రంగులోనే ఉంటాయి. దీనికో ముఖ్యమైన కారణం ఉంది. చిన్నారుల హక్కుల పరిరక్షణలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో బాలుర విభాగమైన యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (United Nations Childrens Fund) యూనిసెఫ్ దీనికి శ్రీకారం చుట్టింది. భారత్‌ కూడా దీనికి మద్దతునిచ్చింది. సంఘీభావంగా చారిత్రక కట్టడాలు, భవనాలపై నీలం రంగు ఉండేలా చర్యలు తీసుకుంది.

బాలల దినోత్సవమైన నవంబర్ 14నుంచి నవంబర్ 20 వరకూ ఈ భవనాలన్నీ నీలం రంగులో ఉంటాయి. మన దేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటే నవంబర్ 20న యూనిసెఫ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా బాలల దినోత్సవం (World Childrens Day) జరుపుకుంటారు.

చిన్నారుల హక్కుల పరిరక్షణ

శాంతి

భద్రత

అవకాశాలు

సమానత్వం

కలుపుకోవడం

ఆనందం

చిన్నారుల వర్తమానంతో పాటు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు వారి హక్కులు, అవకాశాలపై అందరికీ అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో ఒకటి గో బ్లూ (Go Blue).

Updated Date - 2022-11-14T15:04:05+05:30 IST