First Date Tips: మీ ఫస్ట్ డేట్ కి ఏలా సిద్ధం అవుతున్నారు.
ABN , First Publish Date - 2022-08-23T18:23:18+05:30 IST
మొదటిసారిగా డేటింగ్ కు వెళుతున్నారంటే కాస్త ఆందోళన ఉంటుంది. ఇది మీ ఒక్కరిలోనే కాదు చాలామందిలో ఉండే కామన్ సమస్యే.
కొత్తవారిని కలవడం అంటే అదో తీయని జ్ఞాపకంలా మిగిలిపోవాలి. దానికోసం మొదటిసారి కలిసే ప్రదేశం మీకు బాగా నచ్చినదైతే మీ మీట్ ఇంకా కొత్తగా కాస్త చనువుగా ఉంటుంది. తెలిసిన ప్లేస్ కావడం వల్ల మీరు మరీ నర్వస్ గా ఫీల్ కారు. ముందుగా మీకు వీలైన సమయాన్ని ఫిక్స్ చేసుకోండి.
మొదటిసారిగా డేటింగ్ కు వెళుతున్నారంటే కాస్త ఆందోళన ఉంటుంది. ఇది మీ ఒక్కరిలోనే కాదు చాలామందిలో ఉండే కామన్ సమస్యే. కొత్త వ్యక్తితో పరిచయం మీకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ముందుగా వారిని మీట్ కావడానికి మీరు ఎలాంటి దుస్తులు వేసుకుంటే బావుంటుందో ఎంచుకోవాలి. అలాగే ఆ సమయంలో మీరు తాగే, తినే ఆహారం మీద కూడా మీకు ఓ ఆలోచన ఉండటం చాలా అవసరం. మీరే చొరవ తీసుకుని ఫుడ్ ని ఆర్డర్ చేయవచ్చు. ఇది మీ ఇద్దరి మధ్యా కాస్త ఫ్రీగా మసిలేందుకు అవకాశంగా ఉపయోగపడుతుంది.
ఈ డేటింగ్ చిట్కాలు పాటిస్తే అబ్బాయి అయినా అమ్మాయి అయినా తమ మొదటి డేట్ కు మంచి ప్రేరణగా నిలుస్తాయి. ఈ డేట్ మీకు గొప్ప కలగా మిగులుతుంది.
1. మరీ పరిస్థితిని ఓవర్ కాంప్లికేట్ చేసుకోకండి.
మొదటి డేట్ కోసం విపరీతంగా ఆలోచించేసి పరిస్థితిని కాంప్లికేట్ చేసుకోవద్దు. ముందుగా చిన్నగా కాఫీ అని మొదలుపెడితే పరిస్థితి బావుంటే అదే లంచ్, డిన్నర్ వరకూ తీసుకుపోతుంది.
2. అనవసరంగా ఒత్తిడి చేయద్దు.
మొదటిసారి కలవడం అంటే కాస్త ఆందోళన ఉంటుంది అయితే ఈ పరిస్థితిని మీరే ఆనందంగా మార్చుకోవాలి. మీరెంత ఈజీగా ఒత్తిడి లేకుండా ఉంటారో మీ డేట్ అంత ఆనందంగా మారుతుంది. ఓ చిన్న చిట్కా ఏంటంటే.. మీ భాగస్వామికి ఎదురుగా కాకుండా కాస్త ఎడంగా కూర్చుంటే మీ ఇద్దరి మధ్యలో యాంగిల్ నుంచి మిగతావారిని గమనిస్తూ మాట్లాడుకునే వీలు కలుగుతుంది. దీనివల్ల మాటలు తడుముకునే పరిస్థితి ఉండదు.
3.డ్రస్ ను మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి.
సౌకర్యవంతమైన డ్రస్ ను ఎంచుకోండి. మీకు నచ్చిన కలర్ అదీ ప్లజంట్ గా కనిపించేలా చేసేది ధరించండి.
4. మరీ పొగడ్తలు వద్దు.
అప్పటి వరకూ ఇద్దరూ మెసేజ్, ఫోన్ కాల్స్ అంటూ పరిచయమే తప్ప ఇద్దరికీ పెద్ద సాన్నిహిత్యం ఉండకపోవచ్చు. ఎన్ని ఫోటోలు పంపుకున్నా, వీడియో కాల్స్ చేసుకున్నా వ్యక్తిగతంగా కలుసుకున్న ఈ మొదటి క్షణాలను మీకు వచ్చిన పొగడ్తలతో ఆమెను లేదా అతనిని చూడగానే పొగుడుతూ మాత్రం మొదలు పెట్టకండి. చాలా నార్మల్ గా ఉండేందుకు ప్రయత్నించండి. మీ డిగ్నిటీకి ఇదో పరీక్ష అనుకోండి.
5. ప్రశ్నల బాణాలు సంధించకండి.
కలుసుకున్న మొదటి రెండు క్షణాల్లోనే ప్రశ్నలు సంధించి అవతలి వారిని కన్ఫూజన్ లో పడేయకండి. అడిగే ప్రశ్నలు వారికి నచ్చేవిగా ఉండేలా చూడండి.
నచ్చిన రంగు
చివరిగా చదివిన పుస్తకం ఏమిటి?
ఇప్పటివరకు అందుకున్న ఇష్టమైన బహుమతి ఏమిటి?
ఎప్పుడూ ప్రయత్నించనిది కానీ ఎల్లప్పుడూ కోరుకునేది ఏమిటి?
కుటుంబంతో ఉన్న ఇష్టమైన జ్ఞాపకం ఏమిటి?
ఏవైనా క్రేజీ ట్రావెల్ స్టోరీలు ఉన్నాయా?
వీటన్నింటికీ ఎదుటివారు చెప్పే సమాధానాలు ఓపిగ్గా వినండి. ఇది ఓ ఇంటర్వ్యూలానో, ఇంటరాగేషన్ లానో కాకుండా చాలా క్యాజువల్ గా మాటలు కలపడం తెలుసుకోవాలి. అవతలి వ్యక్తికి మీ మీద ఆసక్తి కలిగేవిధంగా మార్చుకోవాలి.
6. బాడీలాంగ్వేజ్ చాలా ముఖ్యం..
ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు ముందుకు వంగడం, కళ్ళల్లోకి చూడటం, నవ్వడం ఇవన్నీ మీరు నమ్మకంగా ఓపెన్ గా ఉన్నారనే విషయాన్ని తెలుపుతాయి. లేదంటే మీ చేతులు నలుపుకోవడం, కూర్చున్న గదిని చుట్టూ చూడటం, కూర్చున్నకుర్చీలోంచి కదలడం, భయంగా ఉన్నట్టు కనిపిస్తే మాత్రం మీ డేట్ సరిగా సెట్ కాలేదని అవతలి వ్యక్తితో సంభాషణ కాస్త ఇబ్బందిగా ఉందనే సంకేతాలను పంపుతుంది. అంతే కాకుండా పదే పదే ఫోన్ చూడటం, మెసేజ్ చేయడం వంటివి కూడా ఇతరులకు ఇబ్బందిగా కనిపిస్తాయి.
7. మితంగా మంచి సంభాషణ చేయండి.
మన మాటతీరు కూడా ఒక్కోసారి మంచి అభిప్రాయాన్ని తెచ్చిపెడుతుంది. అయితే అదే మాటతీరు ఒక్కోసందర్భంలో చెడు అభిప్రాయాన్నీ తెస్తుంది. ఎదుటివారికి ఇబ్బంది కలిగించని విధంగా సున్నింతంగా మాటలు కలపండి. ఇది ఇద్దరిని దగ్గరయ్యేలా చేస్తుంది.
8.మర్వాద పూర్వకంగా గుడ్ బై చెప్పండి.
మీ మొదటి డేట్ ఆనందంగా గడిపినందుకు కృతజ్ఞతను మర్వాదపూర్వకంగా తెలియపరచండి. లేదా మీకు ఈ మీట్ అసౌకర్యంగా అనిపించినా సరే దానిని కూడా నిశ్శంకోచంగా తెలియపరచండి. ఒకవేళ నచ్చినట్లయితే అదే మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారనేది కూడా అడిగేయండి.