Put your devices away : ఫోన్లు, టాబ్లెట్లతో ఎక్కువ సమయం గడపడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుందట.
ABN , First Publish Date - 2022-09-03T18:12:18+05:30 IST
24గంటల సమయాన్నీ ఫోన్స్ టాబ్లెట్లతో నింపేసుకుంటున్నాం. అవసరానికి మించి వీటిమీద ఆధారపడిపోతున్నాం.
రోజురోజుకూ సాంకేతికత ఎంతగా విజృంభిస్తుందంటే ప్రయాణాల్లోనూ, షాపింగ్, తినడం, పడుకోవడం, సినిమాలు ఒకటేమిటి మొత్తం మన 24గంటల సమయాన్నీ ఫోన్స్ టాబ్లెట్లతో నింపేసుకుంటున్నాం. అవసరానికి మించి వీటిమీద ఆధారపడిపోతున్నాం. ఒక సరదా అయినా సంతోషమైనా, దుఃఖమైనా దానిని మనుషులతో కాకుండా పరికరాలతో పంచుకుంటున్నాం.
కొత్త అధ్యయనాలు ఏం చెపుతున్నాయంటే ఎక్కువ సమయం వాటితోనే గడిపితే త్వరగా వృద్ధాప్యం వస్తుందట.. ఎక్కువ సమయం ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల చర్మం, మెదడు కణాలపై చెడు ప్రభావం చూపుతుందని తేల్చింది.
టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్ల వంటి రోజువారీ పరికరాల నుండి వెలువడే బ్లూ లైట్‌ను అధికంగా వాడటం వల్ల హానికరమైన ప్రభావాలు వస్తాయట. ఇవి కణాల నుండి న్యూరాన్ల వరకు మన శరీరంలోని జీవక్రియ స్థాయిలను ప్రభావితం చేస్తాయి.
నీలి కాంతిలో మెటాబోలైట్ సక్సినేట్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి ప్రతి కణం పనితీరును పెరుగుదలను నియంత్రిస్తాయి. ఈ బ్లూ కిరణాలు మన శరీరం మీద పడటం వల్ల శరీరంలోని శక్తి కణాలు క్షీణిస్తాయి.
నెమ్మదిగా వృద్ధాప్య ఛాయలు మొదలవుతాయి. గ్లుటామేట్ స్థాయిలు పెరిగి మెదడు పనితీరును మందగించేలా చేస్తాయి. దీని అర్థం శరీరం మెదడు నీలి కాంతి ప్రభావంతో ఉత్సాహాన్ని కోల్పోతుంది.