ఫేస్ బుక్ లో పోలీసుల పోస్టుకు రిప్లయ్ ఇచ్చిన దొంగ.. తరువాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-12-04T13:52:46+05:30 IST

మోసాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే ఓ వ్యక్తి పోలీసుల పోస్ట్ కింద నా సంగతేంటి అంటూ కామెంట్ చేసాడు.

ఫేస్ బుక్ లో పోలీసుల పోస్టుకు రిప్లయ్ ఇచ్చిన దొంగ.. తరువాత ఏం జరిగిందంటే..

అడిగిమరీ తన్నించుకోవడమంటే ఇదే కాబోలు.. పోలీసులు తమ నివేదికల ప్రకారం వారి పరిగణలో ఉన్న కేసులను పరిశీలించి టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ నిందితుల లిస్ట్ తయారుచేసి పేస్ బుక్ లో పోస్ట్ చేసారు. అయితే హత్యలు, దొంగతనాలు, మోసాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే ఓ వ్యక్తి పోలీసుల పోస్ట్ కింద నా సంగతేంటి అంటూ కామెంట్ చేసాడు. అతని కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

జార్జియా దేశంలో క్రిమినల్ రికార్డుల ప్రకారం పోలీసులు టాప్ టెన్ నిందితులను ఎంపిక చేసి మోస్ట్ వాంటెడ్ నిందితులుగా ప్రస్తావిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. స్పాల్డింగ్ అనే వ్యక్తి ఆ పోస్టులు చూసి అందులో తన పేరు లేదని పోలీసుల పోస్ట్ క్రింద నా గురించి చేసారు అని కామెంట్ పెట్టారు. అతని కామెంట్ గమనించిన పోలీసులు.. "అవును అందులో నువ్వు కూడా ఉండాల్సిన వాడివే నీ పేరు లేకుంటే అందులో నిన్ను చేర్చాల్సిన అవసరం లేదని కాదు. ప్రస్తుతం మేము వీళ్ళకోసం వెతుకుతున్నామని అర్థం. అయినా నీకోసం రెండు యాక్టివ్ వారెంట్ లు మా చేతుల్లో ఉన్నాయి కాబట్టి వస్తున్నాం" అని అతనికి బదులిచ్చారు. అతని కామెంట్ చూసిన నెటిజన్లు తనని తాను పోలీసులకు గుర్తుచేస్తున్నాడు ఇతను అని విస్తుపోయారు. అడిగిమరీ తన్నించుకోవడం అంటే ఇదే కదా అని అనుకుంటున్నారు.

Updated Date - 2022-12-04T13:52:48+05:30 IST