T20 World Cup: ప్రపంచకప్‌లో ఫైనల్ చేరే జట్లు ఏవో చెప్పేసిన డివిలియర్స్

ABN , First Publish Date - 2022-11-08T19:15:04+05:30 IST

టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరుకునే జట్లు ఏవో సౌతాఫ్రికా (South Africa) మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చెప్పేశాడు

T20 World Cup: ప్రపంచకప్‌లో ఫైనల్ చేరే జట్లు ఏవో చెప్పేసిన డివిలియర్స్

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరుకునే జట్లు ఏవో సౌతాఫ్రికా (South Africa) మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చెప్పేశాడు. ఇప్పటికే ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. తొలి సెమీ ఫైనల్‌లో రేపు (బుధవారం) న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్లు తలపడతాయి. గురువారం ఇండియా-ఇంగ్లండ్ జట్లు తలపడతాయి. ఈ రెండు మ్యాచుల్లో విజయం సాధించి న్యూజిలాండ్ (New Zealand), ఇండియా (Team India) ఫైనల్‌కు చేరుకుంటాయని డివిలియర్స్ (AB de Villiers) జోస్యం చెప్పాడు. అంతేకాదు, ఫైనల్లో విజయం భారత్‌నే వరిస్తుందని తేల్చేశాడు. ఈ టోర్నీలో టీమిండియా అద్భుతంగా ఆడుతోందన్న డివిలియర్స్.. ముఖ్యంగా మాజీ సారథి విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో చెలరేగిపోతున్నారని ప్రశంసించాడు. రోహిత్ ఫామ్‌లేక తంటాలు పడుతున్నాడని, జట్టుకు అవసరమైన సమయంలో అతడు కూడా రాణిస్తాడని అన్నాడు. భారత జట్టులో నైపుణ్యం పుష్కలంగా ఉందన్నాడు.

ఐసీసీ టీ20 తాజా ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక, ఆసియా కప్‌తో తిరిగి ఫామ్ అందుకున్న కోహ్లీ ప్రపంచకప్‌లో ఇరగదీస్తున్నాడు. పాకిస్థాన్‌పై కెరియర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడడంతోపాటు అర్ధ సెంచరీలతో రాణిస్తూ జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నాడు. తాజాగా, విరాట్ అక్టోబరు నెలకు గాను ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు కూడా అందుకున్నాడు.

Updated Date - 2022-11-08T19:59:13+05:30 IST