సెమీస్‌లో శ్రీకాంత్‌, గాయత్రి జోడీ

ABN , First Publish Date - 2022-11-05T01:33:52+05:30 IST

హైలో ఓపెన్‌లో కిడాంబి శ్రీకాంత్‌, పుల్లెల గాయత్రి జోడీ సెమీఫైనల్‌కు దూసుకుపోయారు.

సెమీస్‌లో శ్రీకాంత్‌, గాయత్రి జోడీ

సార్‌బ్రూకెన్‌ (జర్మనీ): హైలో ఓపెన్‌లో కిడాంబి శ్రీకాంత్‌, పుల్లెల గాయత్రి జోడీ సెమీఫైనల్‌కు దూసుకుపోయారు. అయితే పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ ద్వయం పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన పురుషులు సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 21-13, 21-19తో ఆరోసీడ్‌ జొనాథన్‌ క్రిస్టీకు షాకిచ్చాడు. మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో పుల్లెల గాయత్రి/ట్రిసా జాలీ జంట 21-17, 18-21, 21-8తో హు య చింగ్‌/లిన్‌ వాన్‌ చింగ్‌ (తైపీ) జోడీని చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌ /చిరాగ్‌ ద్వయం 17-21, 14-21తో బెన్‌ లేన్‌/సీన్‌ వెండి (ఇంగ్లండ్‌) జంట చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్‌లో బన్సోడ్‌ 17-21, 10-21తో గ్రెగోరియా చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Updated Date - 2022-11-05T01:33:55+05:30 IST