Hyderabad: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ

ABN , First Publish Date - 2022-12-19T13:27:35+05:30 IST

హైదరాబాద్: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Rohit Reddy) విజ్ఞప్తిని ఈడీ (ED) తిరస్కరించింది. ఇవాళ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది.

Hyderabad: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ

హైదరాబాద్: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Rohit Reddy) విజ్ఞప్తిని ఈడీ (ED) తిరస్కరించింది. ఇవాళ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో సోమవారం సాయంత్రం 3 గంటలకు ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. తన వద్ద పూర్తి సమాచారం లేదని కొంత సమయం ఇస్తే అన్ని వివరాలతో ఈడీ విచారణకు వస్తారని రోహిత్ రెడ్డి తన న్యాయవాది ద్వారా లేఖ పంపారు. అయితే రోహిత్ రెడ్డి అభ్యర్థనను ఈడీ అధికారులు తోసిపుచ్చారు. ఎట్టి పరిస్థితిల్లో ఈరోజు తమ ముందు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో సాయంత్రం మూడు గంటలకు రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరుకారున్నారు.

కాగా సోమవారం ఉదయం 10:30 గంటలకు విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంటి నుంచి బయలుదేరారు. మధ్యలో సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. సుమారు గంటపాటు ముఖ్యమంత్రితో రోహిత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం సూచనలతో ఈవాల్టి ఈడీ విచారణకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. మరికొంత సమయం కావాలని ఈడీని కోరాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి లాయర్‌తో ఈడీకి లేఖ రాశారు. తనకు చాలా తక్కువ సమయం కేటాయించారని, మరో వారం రోజులు గడువు కావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. వరుస సెలవుల కారణంగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌... ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేక పోయానని అన్నారు. ఆ లేఖను పరిశీలించిన ఈడీ.. ఎమ్మెల్యే అభ్యర్థనను తిరస్కరిస్తూ.. ఈరోజే హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో రోహిత్ రెడ్డి సాయంత్రం మూడు గంటలకు ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

Updated Date - 2022-12-19T14:31:54+05:30 IST