Home » Telangana » Hyderabad
పారిస్ పారాలింపిక్స్-20024లో సత్తాచాటిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ.కోటి నగదు, గ్రూప్-2 ఉద్యోగంతోపాటు వరంగల్‌లో 500గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
భాగ్యనగరంలో కుచించుకుపోయిన జలవనరులతోపాటు, ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడమే ధ్యేయంగా హైడ్రా ముందుకుసాగుతోంది.
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో వర్మ పాత్రతో విలన్‌గా వినాయకన్ పాపులర్ అయ్యారు. అయితే. ఈయనకు సినిమాల్లో విలన్ వేషాలతో మంచి పేరు వచ్చింది. అయితే నిజ జీవితంలోనూ అతను విలన్ చేష్టలతో రెచ్చిపోతున్నాడు. గత ఏడాది కూడా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కుండపోతగా వానలు కురుస్తుండటంతో మున్నేరు వారు పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో లోతట్టు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి బీజేపీ పార్టీ ముందుకు వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు.
టీపీసీసీ పదవిపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు (శనివారం) గాంధీభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... బీసీ నేతకు పీసీసీ ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్‌కు ఈ పదవీని ఏఐసీసీ ఇచ్చిందని తెలిపారు.
తెలంగాణలో బారీ వర్షాలు పడుతన్నాయి. హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతుండటంతో జంట జలాశయాల గేట్లను జలమండలి అధికారులు. ఎత్తారు. వరద వస్తుండటంతో ఉస్మాన్ సాగర్ 2 గేట్లు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తివేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బల్దియా అప్రమత్తం చేసింది.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మాటలను పోలీసు అధికారులు తప్పుగా అర్ధం చేసుకున్నారని బీఆర్ఎస్ నేత జి .దేవిప్రసాద్ తెలిపారు. పోలీసు అధికారుల పట్ల బీఆర్ఎస్కు గౌరవం ఉందని అన్నారు. ఈరోజు(శనివారం) తెలంగాణ భవన్లో దేవిప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఖైరతాబాద్ మహాగణపతిని సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు(శనివారం) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందని తెలిపారు.
ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు(శుక్రవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల గురుకులాల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్స్ రోడ్డు మీద పడ్డారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మెదక్ కలెక్టరేట్లో ఈరోజు(శుక్రవారం) దిశా కమిటీ మీటింగ్ జరిగింది.