Share News

TG POLICE: ఆ కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి

ABN , Publish Date - Nov 21 , 2024 | 11:05 AM

గతంలో.. పోలీసు శాఖలో 16 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. తప్పుగా అనువాదం చేసిన నేపథ్యంలో అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలపాలని.. సమాధాన పత్రాలకు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది.

TG POLICE: ఆ కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి

హైదరాబాద్: తెలంగాణలో స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుల్స్ 9నెలల శిక్షణ పూర్తి అయింది. తెలంగాణ పోలీస్ అకాడమీలో కానిస్టేబుల్స్ 4వ పాసింగ్ ఔట్ పరేడ్ ఇవాళ(గురువారం) జరిగింది. AR, సివిల్, SAR CPL, IT, C AND PTO విభాగాలకు చెందిన 8,047మంది స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణ విజయవంతమైంది. ఫిబ్రవరి21, 2024లో స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుల్స్ శిక్షణ మొదలైంది. తెలంగాణలో 19ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వీరు శిక్షణ తీసుకున్నారు. మొత్తం కానిస్టేబుల్ శిక్షణ పొందిన వారిలో 5709 పురుషులు, 2338 మహిళ అభ్యర్థులు ఉన్నారు. ట్రైనీ కానిస్టేబుల్స్‌కి సమగ్రంగా అన్ని అంశాలపై శిక్షణ ఇచ్చారు. సివిల్, క్రిమినల్, సైబర్ కేసులు NDPS యాక్ట్, క్రైమ్, సెల్ఫ్ డిఫెన్స్ ఇలా చాలా అంశాలపై ట్రైనింగ్ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ 5470 , పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1361 కానిస్టేబుల్స్ చదివారు. ఇందులో టెక్నికల్1755, నాన్ టెక్నికల్ 5505, లా పూర్తి చేసుకున్న వారు 15మంది ఉన్నారు. నేడు పాసింగ్ ఔట్ పరేడ్ తర్వాత తెలంగాణ పౌరుల సేవలో 8,047 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ జితేందర్ , పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.


మేడ్చల్‌లో...

మేడ్చల్: మేడ్చల్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్‌లో నిర్వహించిన దీక్షాంత్ పేరేడ్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 526 మంది సివిల్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఇంటలీజెన్స్ డీజీపీ శివాధర్ రెడ్డి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు అవార్డులు అందజేశారు 9 నెలలుగా శిక్షణ పూర్తి చేసుకొని తెలంగాణ పోలీస్ శాఖలో చేరబోతున్న వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. . అనంతరం ఇంటలీజెన్స్ డీజీపీ శివాధర్ రెడ్డి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ మంచి సేవలు అందించాలని కోరారు. అనంతరం ట్రైనింగ్ ప్రిన్సిపల్ మధుకర్ స్వామి మాట్లాడుతూ.. 2024 సంవత్సరంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారు పలు సూచనలు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వీరు వివిధ జిల్లాల్లో తమ విధులు నిర్వహించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్ ఏసీపీ వెంకట్ రెడ్డి, పేట్ షబీరాబాద్ ఏసీపీ రాములు, సీఐలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 02:39 PM