పనీర్ గోల్కొండ
ABN , First Publish Date - 2022-11-12T12:40:05+05:30 IST
ప్యాన్లో పనీర్ క్యూబ్స్ వేసి అందులోకి పచ్చిమిర్చి పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, పెరుగు, ఉప్పు కలిపి మారినేట్ చేసుకోవాలి.
కావాలసిన పదార్థాలు: పనీర్- 500 గ్రాములు(2 ఇంచ్ క్యూబ్స్గా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి పేస్ట్- 1 టీస్పూన్(సుమారు ఆరేడు పచ్చిమిర్చి తీసుకుంటే సరి), అల్లం, వెల్లుల్లి పేస్ట్- 1 టీస్పూన్, నిమ్మరసం- 1 టీస్పూన్, గరం మసాలా పౌడర్- 1 టీస్పూన్, పెరుగు- అరకప్పు, తాజా కొత్తిమీర ఆకులు- అరకప్పు, ఉప్పు- రుచికి తగినంత, క్రీమ్- గార్ని్షకోసం, వెన్న- గార్నిషింగ్కి సరిపడ
తయారీ విధానం: ప్యాన్లో పనీర్ క్యూబ్స్ వేసి అందులోకి పచ్చిమిర్చి పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, పెరుగు, ఉప్పు కలిపి మారినేట్ చేసుకోవాలి. మిశ్రమం అంతా పట్టేంత వరకూ ఉంచి వీటిని స్కీవెర్స్కి గుచ్చాలి. వీటిని మట్టి ఓవెన్ మీద కుక్ చేయాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలను వెన్న తర్వాత క్రీమ్తో బ్రష్ చేయాలి. చపాతిలోకి తినొచ్చు. లేదా స్నాక్లా పనీర్ ముక్కలను లాగించేయచ్చు.