శ్రీలంక వంకాయకూర
ABN , First Publish Date - 2022-03-02T19:19:04+05:30 IST
వంకాయలు- ఎనిమిది, టొమాటో- ఒకటి, ఉల్లి గడ్డ- ఒకటి, చింత పండు పొడి- అర స్పూను, చింత పండు నీళ్లు- కప్పు, కారం పొడి- రెండు స్పూన్లు
కావలసిన పదార్థాలు: వంకాయలు- ఎనిమిది, టొమాటో- ఒకటి, ఉల్లి గడ్డ- ఒకటి, చింత పండు పొడి- అర స్పూను, చింత పండు నీళ్లు- కప్పు, కారం పొడి- రెండు స్పూన్లు, బెల్లం- స్పూను, కొబ్బరి పాలు- కప్పు, అల్లం, వెల్లుల్లి ముక్కలు- కొన్ని, జీలకర్ర పొడి- స్పూను, పసుపు- అర స్పూను, లవంగాలు- నాలుగు, ఎండు మిర్చి- మూడు, ఆవాలు- స్పూను, ఉప్పు, నూనె, నీళ్లు- తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా కూరగాయల్ని తరగాలి. పాన్లో నూనె వేసి ఆవాలు, ఎండు మిర్చి చిటపటలాడించాలి. ఉల్లి, అల్లం, వెల్లుల్లి ముక్కలూ జతచేయాలి. ఉల్లి రంగు మారాక టొమాటోలు కలపాలి. రెండు నిమిషాల తరవాత వంకాయ ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, బెల్లం, ఉప్పు వేసి కలిపాలి. చింతపండు నీళ్లు కూడా వేసి కలిపి మూతపెట్టాలి. చిన్న మంట మీద వంకాయలు మెత్తపడేవరకు మగ్గించి ఆ పైన కొబ్బరి పాలు వేసి బాగా కలపాలి. అయిదు నిమిషాల తరవాత పొయ్యి కట్టేస్తే సరి.