AP Minister : పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నానంటూ తిరుమల వెంకన్న సాక్షిగా ఏపీ మంత్రి సంచలనం

ABN , First Publish Date - 2023-06-24T12:24:43+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానంటూ మంత్రి విశ్వరూప్ తిరుమల వెంకన్న సాక్షిగా సంచలనానికి తెరదీశారు. నేడు తిరుమలలో విశ్వరూప్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు మాత్రమే కాకుండా తానూ కోరుకుంటున్నానన్నారు.

AP Minister : పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నానంటూ తిరుమల వెంకన్న సాక్షిగా ఏపీ మంత్రి సంచలనం

తిరుమల : జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానంటూ మంత్రి విశ్వరూప్ (Minister Viswaroop) తిరుమల (Tirumala) వెంకన్న సాక్షిగా సంచలనానికి తెరదీశారు. నేడు తిరుమలలో విశ్వరూప్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు మాత్రమే కాకుండా తానూ కోరుకుంటున్నానన్నారు. రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చన్నారు. సీఎం కావాలంటే 175 స్థానాల్లో పోటీ చేసి 88స్థానాల్లో గెలిస్తే సీఎం అవ్వొచ్చని తెలిపారు. పొత్తుతో 100 స్థానాల్లోనైనా పోటీ చేసి 50 స్థానాల్లోనైనా గెలవాలన్నారు. ప్రజాస్వామ్యంలో రెండు విధాలుగా సీఎం అవుతారని మంత్రి విశ్వరూప్ అన్నారు.

Updated Date - 2023-06-24T12:24:43+05:30 IST