Home » Andhra Pradesh
బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం రాబోతోంది. విజయనగరం జిల్లాలోని బాడంగిలో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు. తర్వాత అది నిరుపయోగమైంది. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. అందు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
Andhrapradesh: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. హైకోర్టు బెంచ్‌పై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాయలసీమకు ఉన్న అవకాశాలు చాలా ఎక్కువ అని.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టులు రాయలసీమకు దగ్గర అని తెలిపారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే సీమ అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. తిరుపతి, కడప, ఓర్వకల్లు, పుట్టపర్తిలలో నాలుగు ఎయిర్ పోర్టులు రాయలసీమలోనే ఉన్నాయన్నారు.
ఏపీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. టైర్ 2,3 సిటీస్‌లో కూడా ఐటీ స్పేస్ రావాల్సి ఉందని తెలిపారు. అందుకే ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా కో వర్క్సింగ్ స్పేస్‌ను కల్పించేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు.
Andhrapradesh: జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2నిందితుడు ఎంపీ విజయసాయిరెడ్డిపై దాఖలైన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఎంపీ విజయ్ సాయి రెడ్డికి ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో ఐసీఏఐ సవాల్ చేసింది.
Andhrapradesh: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశంపై శాసనసభలో చర్చ జరిగింది. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ప్రయత్నం ఎంతో ఆనందించదగ్గ పరిణామం అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ వచ్చాక మూడు రాజధానులు పేరుతో కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. రాయలసీమ వాసులను నిలువునా మోసం చేశారు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు.
పేదల బతుకుపై దెబ్బ కొట్టిన వ్యక్తి జగన్ అని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు. మహిళలు, యువత, రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందాలనేది మోదీ లక్ష్యమని తెలిపారు.
రాష్ట్రంలో అన్ని లిఫ్ట్‌లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిప్ట్కు సంబంధించి పీఎస్సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లను బురిడీ కొట్టించాడో ఉద్యోగి. కొరియర్ ట్రాకింగ్ కోసం కాల్ చేయడంతో.. సైబర్ నేరగాళ్లు లైన్లోకి వచ్చారు. ఓటీపీ చెప్పాలని కోరారు. అనుమానం వచ్చి బ్యాంక్‌కు వెళ్లి క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయాలని కోరారు.
Andhrapradesh: 2019-24 మధ్య రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు పెరియని హోంమంత్రి అనిత అన్నారు. వీటిని అరికట్టడానికి స్పెషల్‌గా ఓ టాస్క్ పోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరిని గుర్తించి ప్రోవైలింగ్ చేస్తున్నామని.. అనుమానిత, పాడుపడ్డ ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు. గంజాయికి సంబంధిచి అయిదేళ్లు బాగా విస్తృతం అయ్యిందన్నారు.
కీలకమైన కేసుల్లో అసలేం జరుగుతోంది? గనుల ఘనుడు వెంకటరెడ్డి బెయిలుపై ఎలా బయటికి వచ్చారు?