Share News

Anitha: గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై హోంమంత్రి ఏం చెప్పారంటే

ABN , Publish Date - Nov 21 , 2024 | 10:18 AM

Andhrapradesh: 2019-24 మధ్య రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు పెరియని హోంమంత్రి అనిత అన్నారు. వీటిని అరికట్టడానికి స్పెషల్‌గా ఓ టాస్క్ పోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరిని గుర్తించి ప్రోవైలింగ్ చేస్తున్నామని.. అనుమానిత, పాడుపడ్డ ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు. గంజాయికి సంబంధిచి అయిదేళ్లు బాగా విస్తృతం అయ్యిందన్నారు.

Anitha: గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై హోంమంత్రి ఏం చెప్పారంటే
AP Assembly budget Session

అమరావతి, నవంబర్ 21: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. సభ మొదలవగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు
(Deputy Speaker Raghurama krishna Raju) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) సమాధానం ఇచ్చారు. 2019-24 మధ్య రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు పెరిగాయన్నారు. వీటిని అరికట్టడానికి స్పెషల్‌గా ఓ టాస్క్ పోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరిని గుర్తించి ప్రోవైలింగ్ చేస్తున్నామని.. అనుమానిత, పాడుపడ్డ ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు. గంజాయికి సంబంధిచి ఐదేళ్లు బాగా విస్తృతం అయ్యిందన్నారు. దీని నివారణకు అడిషనల్ డీజీ స్ధాయి అధికారిని నియమించి క్యాబినెట్ ఆమోదం తీసుకున్నామని హోంమంత్రి అనిత తెలిపారు.

కీలక కేసులపై చంద్రబాబు ఆరా


వారిపై దృష్టి పెట్టండి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

గంజాయి అనేది ఓ వ్యాపారంగా వైసీపీ చేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. ఐదేళ్లు ఏపీ గంజాయి, బ్లేడ్ బ్యాచ్ కోరల్లో చిక్కుకుందన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోలేదని.. అప్పటి హోంమంత్రి రివ్యూ కూడా పెట్టలేదని తెలిపారు. రాజమహేంద్ర వరం కూడా దానికి అతీతం కాదన్నారు. ‘‘ద్వారంపూడి విక్రమ్ రెడ్డి తెలంగాణలో కోట్లాది రూపాయలు విలువ చేసే గంజాయితో దొరికారని... మా ప్రాంతంలో ఉన్న రీజనల్ కోఆర్డనేటర్‌కు సంబంధాలు ఉన్నాయి’’ అని తెలిపారు. మీ భద్రత- మా బాధ్యత అని మహిళలతో, పోలీసులతో మీటింగ్‌లు నిర్వహించామని తెలిపారు. ఈ ఐదేళ్లలో 57 మందిపై గంజాయి కేసు పెట్టారని.. జైలుకు వెళుతున్నారు బయటకు వస్తున్నారన్నారు. ‘‘జైలులో గంజాయి పండించే వాడు. రవాణా చేసేవాడు, అమ్మేవాడు ఉంటున్నారు. వీరు అందరూ కలిసి వ్యాపారాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇలాంటి వారిపై దృష్టి పెట్టాలి’’ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు.


వారిలో మార్పు తేవాలి: ఎమ్మెల్యే సుందరపు విజయ్

‘‘గ్రామాల్లో గంజాయి వాళ్ళు ఓ గ్రూపు... ఇలాంటి వాళ్ళను ఏమీ అనడానికి లేదు. ప్రభుత్వం సపరేట్ వింగ్ ఏర్పాటు చేశారు... మంచి ఫలితాలు వస్తాయి అని భావించాం. 2019 చివరలో, 2020 లో అనకాపల్లి వద్ద రౌడీ షీటర్ల పిక్‌నిక్ జరిగింది. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అందరిపైనా కేసులు పెట్టి సెక్షన్లు పెట్టి ఏమీ చేయలేం. వారిలో మార్పు తేవాడానికి చేయాల్సిందంతా చేయాలి’’ అని హోంమంత్రికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విజ్జప్తి చేశారు.


మద్యం రేటు పెరగడంతోనే: ఎమ్మెల్యే మాధవి

మద్యం రేటు పెరగడంతో చాలా మంది గత ఐదు సంవత్సరాలుగా గంజాయికి అలవాటుపడ్డారని ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి తెలిపారు. పెయిన్ కిల్లర్‌లను సెలైన్‌లో కలిపి ఇంజక్షన్ ద్వారా ఎక్కించుకుని ఇంజక్షన్ తీసుకుంటున్నారని అన్నారు. ఒకే ఇంజక్షన్ అందరూ తీసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు వారిని జైల్లో పెట్టాలని వారే కోరుతున్నారని అన్నారు. బెంగుళూరు- తాడిపత్రి- పొద్దుటూరు అక్కడి నుంచి కడపకు వస్తోందన్నారు. గంజా అనే కాదు మెడికల్ షాపులో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కడపలో డీ అడక్షన్ సెంటర్ పెడితే దానికిందే మద్యం దుకాణం పెట్టారని ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి పేర్కొన్నారు.


గంజాయిని అరికట్టేందుకు....

చంద్రగిరి నియోజకవర్గంకు లోకేష్ యాత్రకు వెళ్లామని.. అప్పుడు ఓ తల్లి, బిడ్డ వచ్చి తన కుమార్తెను గంజాయికి అలవాటు చేశారని ఏం చేయాలని అడిగారని హోంమంత్రి అనిత తెలిపారు. ‘‘ ప్రభుత్వంలోకి రాగానే గంజాయిపై దృష్టిపెట్టాలి అని ఆ రోజు లోకేష్ చెప్పారు’’ అని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో పండే గంజాయి ఇప్పుడు స్కూలు బ్యాగ్‌లలోకి వచ్చేశాయన్నారు. గంజాయిని అరికట్టడానికి సిస్టంను రిపేర్ చేశామని.. గంజాయి విషయంలో ఉన్న చెక్ పోస్టులు రెండు మాత్రమే అని , సిసి కెమెరాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఐదు నెలల కాలంలోనే పాతిక వేల మందిని పట్టుకుని జైలుకు పంపారన్నారు. రాజమండ్రిలో ఓ ఫార్మసిస్టు.. ఖైదీకి గంజాయి అందిస్తున్నట్టు సిసి కెమెరాల్లో కనిపించిందన్నారు. గంజాయి నిరోధానికి ప్రత్యేక వింగ్ ఇచ్చి 469 మంది సిబ్బందికి ఇచ్చామని తెలిపారు. పోలీసు డిపార్ట్మెంట్‌లో కూడా మార్పు వచ్చిందని హోంమంత్రి అనిత వెల్లడించారు.

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు..


గంజాయిపై ఈ సెషన్‌లో గానీ వచ్చే సెషన్‌లో గానీ స్వల్పకాలిక చర్చ జరపాలని మంత్రి నారా లోకేష్ కోరగా.. సమయం చూసి స్వల్పకాలిక చర్చపై నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

Cyber Fraud ఈ-నేరగాళ్లకు ఝలక్ ఇచ్చిన ఉద్యోగి

షాకింగ్ రూ. 4 వేలు తగ్గిన వెండి.. ఇక బంగారం రేటు

Read latest AP News And Telugu News

Updated Date - Nov 21 , 2024 | 10:47 AM