Tirumala Sticks: తిరుమల భక్తులకు ఊతకర్రలు.. ట్రోల్స్ మాములుగా లేవుగా..!!

ABN , First Publish Date - 2023-08-17T17:15:30+05:30 IST

తిరుమల నడకదారిలో వెళ్లే భక్తులకు ఊతకర్రలు ఇస్తామని రెండు రోజుల క్రితం టీటీడీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. చిరుతపులుల దాడి నుంచి తప్పించుకోవడానికి కర్రలు సరిపోతాయా.. అసలు భక్తులకు అంత ధైర్యం ఉంటుందా అని సోషల్ మీడియా వేదికగా భక్తులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊతకర్రల అంశంపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ హోరెత్తుతున్నాయి.

Tirumala Sticks: తిరుమల భక్తులకు ఊతకర్రలు.. ట్రోల్స్ మాములుగా లేవుగా..!!

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో భక్తులకు రక్షణ కరువైంది. అలిపిరి (Alipiri) నడక మార్గంలో వన్యప్రాణులు తిరుగుతుండటంతో భక్తులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల చిరుత పులి దాడిలో నెల్లూరు జిల్లా(Nellore District)కు చెందిన ఓ చిన్నారి మృత్యువాత పడటం కలకలం రేపింది. దీంతో టీటీడీ (TTD) తీరుపై భక్తులు విరుచుకుపడుతున్నారు. అయితే నడకదారిలో వెళ్లే భక్తులకు ఊతకర్రలు (Walking Sticks) ఇస్తామని రెండు రోజుల క్రితం టీటీడీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. చిరుతపులుల దాడి నుంచి తప్పించుకోవడానికి కర్రలు సరిపోతాయా.. అసలు భక్తులకు అంత ధైర్యం ఉంటుందా అని సోషల్ మీడియా వేదికగా భక్తులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊతకర్రల అంశంపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ హోరెత్తుతున్నాయి.


అసలు భక్తులకు ఊతకర్రలు ఇవ్వాలన్న ఆలోచన టీటీడీకి ఎలా వచ్చిందో అని నెటిజన్‌లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. కర్రలు చూస్తే పారిపోవడానికి అక్కడ తిరిగేది కుక్కలు, పందులు కాదని.. పులులు, సింహాలు అని కామెంట్లు పెడుతున్నారు. చిరుత పులి దగ్గరకు వస్తే కర్ర తీసుకుని పో అంటే పోతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


మరోవైపు అలిపిరిలో మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలకు అనుమతిస్తామని చెప్పడం భక్తులను అయోమయానికి గురిచేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి వచ్చి కాలినడకన తిరుమల వెళ్లాలంటే ఈ సమయం సరిపోదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.


భక్తులకు ఇచ్చే కర్రలపై జగన్ స్టిక్కర్లు అతికించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ కర్రలను చూసిన నెటిజన్‌లు ఫన్నీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ప్రచారానికి వైసీపీ కర్రలను కూడా వాడుకుంటోందని ఎద్దేవా చేస్తున్నారు.


‘కర్రలు రెడీ.. ఇక చిరుతపులి రావటమే ఆలస్యం అన్నట్టు, బిల్డ్ అప్ ఇస్తున్నారు.. కానీ అక్కడ ఉండేది మనుషులని తినేస్తున్న సిసలైన చిరుతపులి. వీళ్ళని నమ్మడం కంటే, గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్ళటం ఉత్తమం అని మరికొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.


‘చిరుతతో కర్రసాము చేసి గెలవడానికి అలిపిరి వద్ద ఉచిత శిక్షణా తరగతులు ఆగస్టు 20 నుంచి ప్రారంభం. ఆసక్తి కలిగిన వారు చిరుత పులిని వెంట తెచ్చుకోవాలి. కర్ర ఉచితం. భక్తులు ఈ సదుపాయం వినియోగించుకో ప్రార్థన’ అంటూ కొందరు నెటిజన్‌లు టీటీడీ కర్రల ప్రకటనను ట్రోల్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

AP Politics: ప్రజల నెత్తిన వైసీపీ బోగస్ సర్వేలు.. అంత భయం ఎందుకో?

******************************************************************************

MVV Satyanarayana: జగన్‌పై అందుకే కేసులు.. వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్ వైరల్

******************************************************************************

Independence Day : బాబోయ్ ఏంటిది.. వైసీపీ రిలీజ్ చేసిన ఈ ఫొటో చూశాక.. ఇక మీ ఇష్టం..!

Updated Date - 2023-08-17T17:19:59+05:30 IST