Share News

AP Highcourt: ఐఆర్‌ఆర్‌ కేసులో మాజీ మంత్రి నారాయణ సతీమణికి ఊరట

ABN , First Publish Date - 2023-10-16T15:25:05+05:30 IST

అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు మరో ముగ్గురికి హైకోర్టులో ఊరట లభించింది.

AP Highcourt: ఐఆర్‌ఆర్‌ కేసులో మాజీ మంత్రి నారాయణ సతీమణికి ఊరట

అమరావతి: అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో (IRR Case) మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు మరో ముగ్గురికి హైకోర్టులో (AP HighCourt) ఊరట లభించింది. ఈ నలుగురు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) విచారణ జరిగింది. వీరందరిని సీఆర్‌పీసీలోని 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ పేర్కొంది. న్యాయవాది సమక్షంలో విచారణ జరుపుతామని సీఐడీ న్యాయవాది చెప్పారు. దీంతో పిటీషన్‌లను న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి డిస్పోజ్ చేశారు.


మరోవైపు ఇదే కేసులో కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరికొంత ఊరట లభించింది. నేడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 18కి ఏపీ హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకూ ముందస్తు బెయిల్ పొడిగించడం జరిగింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై కూడా అప్పటి వరకూ విచారించవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. తుది వాదనల కోసం ఈ నెల18 కి వాయిదా వేయడం జరిగింది.

Updated Date - 2023-10-16T15:30:50+05:30 IST