Food Poisoning.. కర్నూలు జిల్లా: ఆలూరులో ఫుడ్ పాయిజన్
ABN , First Publish Date - 2023-09-17T08:11:06+05:30 IST
కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గం దేవనకొండలోని కేజీబీవీ స్కూల్లో 20 మంది విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఉడికి ఉడకని అన్నం కలుషిత నీరు వల్ల విద్యార్థినిలకు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో..
కర్నూలు జిల్లా: ఆలూరు (Alur) నియోజకవర్గం దేవనకొండలోని కేజీబీవీ (KGBV) స్కూల్లో (School) 20 మంది విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ (Food Poisoning) జరిగింది. ఉడికి ఉడకని అన్నం కలుషిత నీరు వల్ల విద్యార్థినిలకు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో వారిని స్కూలు సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదని విద్యార్థినీలు కోట్ల సుజాత దృష్టికి తీసుకోవచ్చారు. దీంతో ఆమె పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.