Share News

గ్రామాల అభివృద్ధికి సహకరించని అధికారులు

ABN , First Publish Date - 2023-11-27T21:47:39+05:30 IST

గత టీడీపీ ప్రభుత్వంలో సర్పంచులకు అధికారులు పూర్తిగా సహకరించారని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని రావులకొల్లు సర్పంచి వెంగపనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది.ఎం

గ్రామాల అభివృద్ధికి సహకరించని అధికారులు
27 కెఎల్‌జి1- జెడ్పీటీసీతో వాగ్వాదం చేస్తున్న సర్పంచి వెంగప నాయుడు

కలిగిరి మండల మీట్‌లో సర్పంచి ఆవేదన

కలిగిరి, నవంబరు 27: గత టీడీపీ ప్రభుత్వంలో సర్పంచులకు అధికారులు పూర్తిగా సహకరించారని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని రావులకొల్లు సర్పంచి వెంగపనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది.ఎంపీపీ మెట్టుకూరు శిరీష మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో అధికారులకు సర్పంచులు సహకరించాలన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు మాల్యాద్రిరెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రతి సచివాలయానికి రూ.20లక్షల అభివృద్ధి నిధులతో సీసీరోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు ప్రతిపాదనలు పంపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తప్పుల తడకగా రీసర్వే

రావులకొల్లులో రీసర్వే పూర్తయి రెండేళ్లు గడిచినా, నేటికి భూవివరాలను సరిగా పాసుపుస్తకాల్లో నమోదు చేయలేదని సర్పంచి వెంగపనాయుడు పేర్కొన్నారు. ఇందు వల్ల పంట రుణాలు పొందాలన్నా, భూముల క్రయవిక్రయాలు చేసుకోవాలన్నా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. డీటీ మురళీధర్‌ రాజు సమాధానమిస్తూ మొదటి దశలో రీసర్వే చేసినపుడు సరైన అవగాహన లేకపోవడంతో పొరపాట్లు జరిగాయని, ప్రస్తుతం వెబ్‌ల్యాండ్‌-2 ద్వారా భూవివరాలు సరిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఎమ్మెల్యే మేకపాటి చీటి చించేశాం

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి టీడీపీకి మద్దతు ఇచ్చినప్పటి నుంచి ఆయన చీటిని చించేశామని జెడ్పీటీసీ మాల్యాద్రిరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే చాప్టర్‌ అయిపోయిందని, ఆయనతో మాకు పనిలేదని, ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్టే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ విషయమై రావులకొల్లు సర్పంచి, జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం నెలకొంది.

-----------

Updated Date - 2023-11-27T21:47:41+05:30 IST