Share News

ఆడుదాం ఆంధ్ర క్రీడలకు విస్తృత ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-11-27T23:40:16+05:30 IST

జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ వికా్‌సమర్మత్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సంజనాసిన్హాలతో కలిసి ఆయన ఆడుదాం ఆంధ్రా క్రీడోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఆడుదాం ఆంధ్ర క్రీడలకు విస్తృత ఏర్పాట్లు
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న జేసీ, అధికారులు

జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాఽథ్‌

నెల్లూరు(విద్య), నవంబరు 27 : జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ వికా్‌సమర్మత్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సంజనాసిన్హాలతో కలిసి ఆయన ఆడుదాం ఆంధ్రా క్రీడోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేలా డిసెంబరు 15 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖో, యోగ, టెన్నికాయింట్‌, మారధాన్‌ క్రీడలను నిర్వహిస్తుందన్నారు. పురుషులు, మహిళలలకు వేర్వేరుగా ఐదు విభాగాల్లో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 15 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ క్రీడలో పాల్గొనేందుకు అర్హులన్నారు. జిల్లాలోని 768 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 23,070 మ్యాచ్‌లు, మండలస్థాయిలో 39 మండలాల్లో 730 మ్యాచ్‌లు, 8 నియోజకవర్గాల స్థాయిలో 320 మ్యాచ్‌లు, జిల్లాస్థాయిలో 70 మ్యాచ్‌లు కలిపి మొత్తం 24,190 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామస్ధాయిలో గెలుపొందిన జట్టు మండలస్థాయికి, అక్కడ నుంచి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయికి ఎంపికవుతారన్నారు. పోటీలను విజయవంతం చేసేందుకు సమష్టి కృషి చేయాలని తెలిపారు. కమిషనర్‌ వికా్‌సమర్మత్‌ మాట్లాడుతూ పోటీలకు సంబంధించి ఈనెల 27 నుంచి క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైందన్నారు. ఆడుదాం ఆంరఽధ డాట్‌ ఏపీ డాట్‌ జీఓవీ డాట్‌ ఇన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో, లేదా 1902 నెంబర్‌కు ఫోన్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుగంగ స్పెషల్‌ కలెక్టర్‌ టీ.బాపిరెడ్డి, జడ్పీ సీఈవో బి.చిరంజీవి, సెట్నల్‌ సీఈవో నాగరాజకుమారి, నగరపాలక సంస్ధ అదనపు కమిషనర్‌ శర్మద, డీపీఆర్‌వో ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

===================

Updated Date - 2023-11-27T23:40:43+05:30 IST