Share News

Michoung Effect: నెల్లూరు జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2023-12-07T08:31:35+05:30 IST

నెల్లూరు: జిల్లాలో దారుణం... వరద ముంపు ప్రాంతాల్లో కనీసం తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ శ్రేణులే ఆందోళనలకు దిగారు.

Michoung Effect: నెల్లూరు జిల్లాలో దారుణం

నెల్లూరు: జిల్లాలో దారుణం... వరద ముంపు ప్రాంతాల్లో కనీసం తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ శ్రేణులే ఆందోళనలకు దిగారు. నగరంలోని 12వ డివిజన్‌లో తాగునీటి కోసం స్వయానా మేయర్ భర్త జయవర్ధన్ ఆందోళనకు దిగడంతో.. ఇక తామెవ్వరికి చెప్పుకోవాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

కాగా తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని పేడూరు, నరుకూరు, చింతోపు గ్రామాల్లో మండల సీపీఎం నేత వేగూరి వెంకయ్య ఆధ్వర్యంలో నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. పంట పొలాల్లో పర్యటించి తుఫాన్‌ కారణంగా నీట మునిగిన పొలాల్లో దిగి, ఎంతమేరకు నష్టం జరిగిందో రైతులనడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

తుఫాన్‌ తాకిడికి నష్టపోయిన నిమ్మ రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుఫాన్‌ నిమ్మ రైతులను కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ విషయమై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. నాలుగు రోజులుగా పార్లపల్లి, చెర్లోపల్లి, బ్రాహ్మణపల్లి, అయ్యగారిపాలెం, చెన్నారెడ్డిపల్లి గ్రామాలతోపాటు మరికొన్ని గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Updated Date - 2023-12-07T08:31:37+05:30 IST