Home » Nellore
ఆధిపత్య పోరు, పాత కక్షల నేపథ్యంలోనే హిజ్రాల సంఘం నాయకురాలు మానికల హాసిని హత్య జరిగిందని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ పేర్కొన్నారు. ఈ కేసులో 15మంది నిందితులను గుర్తించామని, వారిలో 12మందిని అరెస్టు చేశామని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన ట్రాన్స్‌జెండర్ హాసిని హత్య కేసులో ఎస్పీ కృష్ణకాంత్ సంచలన విషయాలు వెల్లడించారు. ట్రాన్స్జెండర్ల మధ్య ఆధిపత్య పోరే హత్యకి కారణమని ఆయన తెలిపారు. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
‘ఫెంగల్’ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి.
దేశవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కారిడార్లను ఎన్ఐసీడీసీ (నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్) కింద అభివృద్ధి చేయనున్నారు.
ఇంజన్ మరమ్మతులకు గురై సముద్రంలో నిలిచిపోయిన మెకనైజ్డ్ బోటును మత్స్యశాఖ అధికారులు, కృష్ణపట్నం పోర్టు సిబ్బంది సహకారంతో బుధవారం ఒడ్డుకు తీసుకొచ్చారు.
నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు మార్గం దాదాపుగా సుగమం అయింది. ప్రధాని మోదీ., ముఖ్యమంత్రి చంద్రబాబు మైత్రి ప్రభావం నెల్లూరు జిల్లాలో భారీ పరిశ్రమల స్థాపనకు నాంది పలకనుంది.
రాష్ట్రంలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్‌లు రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా వృధా కాకుండా.. రైతులు సాగు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
బాపట్ల పట్టణంలో కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. 65 ఏళ్ల ఓ వృద్ధుడు తన వయస్సు కూడా మరిచి 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు.
చెన్నై సెంట్రల్-గూడూరు సెక్షన్(Chennai Central-Gudur section) పరిధిలోని తడ, సూళ్లూరుపేట మధ్య రైలుమార్గంలో మరమ్మతుల కారణంగా శుక్రవారం సూళ్లూరుపేట, నెల్లూరు వెళ్లే మెము రైళ్లు కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దయినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతులకు నూతన విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఏపీ పట్టణ, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.