Share News

దమ్ము, ధైర్యం ఉంటే రా.. తేల్చుకొందాం!

ABN , First Publish Date - 2023-11-27T00:14:25+05:30 IST

దమ్ము, ధైర్యం ఉంటే రా.. తేల్చుకొందామంటూ సీతారామపురం వైసీపీ కన్వీనర్‌ చింతంరెడ్డి సుబ్బారెడ్డికి నియోజకవర్గ టీడీపీ నాయకులు సవాల్‌ విసిరారు.

దమ్ము, ధైర్యం ఉంటే రా.. తేల్చుకొందాం!
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు

ఉదయగిరిలో ఉద్రిక్తత

ఉదయగిరి రూరల్‌, నవంబరు 26: దమ్ము, ధైర్యం ఉంటే రా.. తేల్చుకొందామంటూ సీతారామపురం వైసీపీ కన్వీనర్‌ చింతంరెడ్డి సుబ్బారెడ్డికి నియోజకవర్గ టీడీపీ నాయకులు సవాల్‌ విసిరారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావును సామాజిక మాధ్యమం ద్వారా సుబ్బారెడ్డి శనివారం అసభ్యపదజాలంతో దుర్భాషలాడిన ఘటనపై ఆదివారం పట్టణంలోని చెంచలబాబు అతిథిగృహంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ సుబ్బారెడ్డి, బొల్లినేనిని దుర్భాషలాడే స్థాయి నీది కాదు. నీ బతుకేందో అందరికీ తెలుసు. మేము నోరు జారితే నీవు రోడ్డున పడతావ్‌. బలహీనవర్గానికి చెందిన వ్యక్తి దుకాణంపై దాడిచేసి, పోలీసుల ఎదుటే అతన్ని కొట్టి, తిరిగి అతనిపైనే కేసు పెట్టిన నీచ సంస్కృతి నీది. మా పార్టీ మాకు క్రమక్షణ నేర్పింది. మీ పార్టీలాగా మేము సైకోలము కాదు. మా నాయకుల జోలికొస్తే తగిన రీతిలో బుద్ధిచెపుతామని హెచ్చరించారు.

ఉదయగిరిలో ఉద్రిక్తత: వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డి సామాజిక మాధ్యమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేనిని దుర్భాషలాడడంతో టీడీపీ నాయకులు చలో బసినేనిపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన టీడీపీ నాయకులు ఉదయగిరి పట్టణంలోని చెంచలబాబు అతిథిగృహానికి చేరుకొని బసినేనిపల్లి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఉదయగిరి, కలిగిరి సీఐలు గిరిబాబు, ఫిరోజ్‌, ఎస్‌ఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రభాకర్‌, సూర్యప్రకాష్‌ తమ సిబ్బందితో కలిసి వారిని నిలువరించారు. అనంతరం వారితో చర్చించి సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకొంటామని హామీ ఇవ్వడంతో టీడీపీ నాయకులు సద్ధుమణిగారు. పోలీస్‌స్టేషన్‌లో సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్లు బయ్యన్న, చండ్ర మధు, గొంగటి రఘునాథ్‌రెడ్డి, నాయకులు బొల్లినేని వెంకటసుబ్బయ్య, వెంకటాద్రి, యారం కృష్ణయ్య, వెంగపనాయుడు, అబ్బయ్యనాయుడు, బొజ్జా నరసింహులు, ఓబుల్‌రెడ్డి, నల్లిపోగు రాజా, నరసింహా, సందానీ, మాబాషా, మల్లికార్జున పాల్గొన్నారు.

సీతారామపురం : ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై శనివారం సీతారామపురం వైసీపీ మండల కన్వీనర్‌ చింతం రెడ్డి సుబ్బారెడ్డి చేసిన అనుచితమైన వ్యాఖ్యలపై ఆదివారం టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి చేసిన సవాల్‌ని స్వీకరించిన టీడీపీ నాయకులు బసినేనిపల్లికి వెళుతుండగా పోలీసులు సర్దిచెప్పి వెనక్కి పంపించారు. అనంతరం టీడీపీ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు రామారావు కలిసి బొల్లినేని రామారావుపై వ్యాఖ్యలు చేసిన చింతంరెడ్డి సుబ్బారెడ్డి మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల క్లస్టర్‌ ఇన్‌చార్జి వెంగళశెట్టి వెంకటేశ్వర్లు, సర్పంచు కే భాగ్యకుమారి, మాజీ జడ్పీటీసీ కే జ్యోతి, మాజీ మండల అధ్యక్షుడు చెన్నకేశవులు, మండల ప్రధాన కార్యదర్శి పిడుగు రమేష్‌, ముస్లీం మండల సెల్‌ అధ్యక్షుడు గౌసు, జయరాములు, పోలంగారిపల్లె సర్పంచు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

సుబ్బారెడ్డికి సంస్కారం లేదు

జలదంకి: సీతారామపురం వైసీపీ నాయకుడు చింతంరెడ్డి సుబ్బారెడ్డి సంస్కారం లేని నీచుడని మండల టీడీపీ నాయకులు పులిగుంట మధురెడ్డి, వంటేరు జయచంద్రారెడ్డి, పూనూరు భాస్కర్‌రెడ్డి, కంచర్ల వినోద్‌నాయుడు విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సీతారామపురంలో పర్యటించే సమయంలో బీసీ బిడ్డను సుబ్బారెడ్డి విచక్షణ మరచి దాడి చేయడంతో పాటు పోలీ్‌సస్టేషన్‌లో పోలీసుల సమక్షంలో కాలితో తన్నడాన్ని బాధితుడి బొల్లినేని దృష్టికి తెచ్చారన్నారు. స్పందించిన ఆయన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సుబ్బారెడ్డి నీకు ఇదే శిక్ష వేయిస్తామని విమర్శించారన్నారు. దీనికి సంస్కారహీనుడు సుబ్బారెడ్డి తన నోటికి వచ్చినట్లు బొల్లినేనిని తిడుతూ సామాజిక మాద్యమాల్లో వీడియో విడుదల చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. తక్షణమే బొల్లినేనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పెట్టిన భిక్షతో నీ సతీమణి ఎంపీపీ అయితే ఆయననే అనరాని మాటలు అన్న నీది ఒక బతుకేనా అని విమర్శించారు.

============

Updated Date - 2023-11-27T00:14:26+05:30 IST